Monday, December 9, 2024
Homeఆంధ్రప్రదేశ్Sajjala Ramakrishna Reddy | హైకోర్టులో సజ్జలకి ఊరట

Sajjala Ramakrishna Reddy | హైకోర్టులో సజ్జలకి ఊరట

ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)కి టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఏపీ హైకోర్టు (AP High Court) లో ఊరట లభించింది. ఆయనపై పోలీసులు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం మరోసారి పొడిగించింది. తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేసింది. కాగా, ఈ కేసులో పోలీసులు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)కి లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు.

- Advertisement -

వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి టీడీపీ ఆఫీసుపై కొందరు దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ కేసులో వైసీపీ నేతలు జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డి, నందిగం సురేష్, దేవినేని అవినాష్, తలశిల రఘురాం తోపాటు మరో 13 మందిని పోలీసులు నిందితులుగా చేర్చారు. వీరిని పలుమార్లు విచారించారు. మరోవైపు టీడీపీ అధికారంలోకి రాగానే దాడి కేసులో నిందితులుగా ఉన్న పలువురు నేతలు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టు ను ఆశ్రయించారు. ఈ పిటిషన్లపైన న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News