ఏపీ మద్యం కుంభకోణం(Liquor Scam) కేసులో వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి బంధువు సజ్జల శ్రీధర్‌రెడ్డిని(Sajjala Sridhar Reddy) సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని అయిన శ్రీధర్‌రెడ్డి మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కీలక నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఏ6గా ఉన్న ఆయనను హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. శనివారం ఉదయం విజయవాడ తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు ఆయనకు మే 6వరకు రిమాండ్ విధించింది. దీంతో శ్రీధర్ రెడ్డిని విజయవాడ సబ్ జైలుకు తరలించారు.
కాగా మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి, ఏ8గా ఉన్న చాణక్యను అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మరో నిందితుడిగా భావిస్తున్న రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఇటీవలే 10 గంటల పాటు విచారించారు. అయితే ఆయనకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడంతో అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు.