Social Service : ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ధనరాజు వంటి నిస్వార్థపరుల సేవలు ఎంతో అవసరమని బొబ్బిలి రాజవంశీకులు, టీడీపీ సీనియర్ నాయకులు రంగారావు పేర్కొన్నారు. మర్యాదపూర్వక భేటీలో భాగంగా ధనరాజు తన ప్రొఫైల్‌ను రంగారావుకు వివరించగా, ఆయన చేసిన సేవా కార్యక్రమాలను చూసి రంగారావు ముగ్ధులయ్యారు.
HONOR Magic8 Lite : 7500mAh బ్యాటరీ.. సముద్రంలో కూడా ఫోటోలు తీసుకోవచ్చు.!
ధనరాజు సేవా పథం – ముఖ్యాంశాలు:
- గ్రామం దత్తత: బీసీ సంక్షేమ శాఖలో ఉన్నత అధికారిగా పనిచేసిన ధనరాజు, పదవీ విరమణ పొందిన తర్వాత విశ్రాంతి తీసుకోకుండా తన సొంత గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. గ్రామాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు.
- ఆధ్యాత్మిక సేవ: సుమారు రూ. 30 లక్షల సొంత నిధులతో గ్రామంలో అద్భుతమైన రామాలయాన్ని నిర్మించి తన భక్తిని, సేవా గుణాన్ని చాటుకున్నారు.
- విద్య , ఆరోగ్యం: పేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థిక సాయం అందించడం, గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన త్రాగునీటి సమస్యను తీర్చడానికి సొంతంగా వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం వంటి పనులు ధనరాజుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
- పార్టీ పట్ల విధేయత: చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ‘జన్మభూమి’ కార్యక్రమం పట్ల ఆకర్షితులైన ధనరాజు, అప్పటి నుండి పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా గ్రామ స్థాయిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు.
ఎన్ఆర్ఐ సునీల్ సేవలు అమోఘం:
ధనరాజు కుటుంబం మొత్తం సేవా దృక్పథంతో ఉండటంపై రంగారావు ప్రశంసలు కురిపించారు. అమెరికాలో ఉంటున్న ధనరాజు అల్లుడు, ఎన్ఆర్ఐ సునీల్ 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం కోసం విశేష కృషి చేశారని ఆయన గుర్తుచేశారు. స్థానిక యువతకు ఉపాధి మార్గాల్లో తోడ్పాటు అందించడం, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంపై సునీల్‌ను అభినందించారు.
సంతోషంగా ఉంది: సనపల ధనరాజు
చాలా కాలంగా రంగారావు గారిని కలవాలని అనుకుంటున్నానని, నేడు అది నెరవేరడం సంతోషంగా ఉందని ధనరాజు తెలిపారు. తన ప్రొఫైల్‌ను చూసి ఆయన మెచ్చుకోవడం తన అదృష్టమని, గ్రామంలో నిర్మిస్తున్న రామాలయ ప్రారంభోత్సవానికి ఆయన్ను ఆహ్వానించగా సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండపేట పర్యటన సందర్భంగా, అదే మార్గంలో ఉన్న తన స్వగృహానికి రావాలని కోరగా రంగారావు అంగీకరించినట్లు ధనరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్యవటం సహకార సంఘం అధ్యక్షులు కోట తాతబ్బాయి, ఆర్యవటం చౌదరి, అంగర శ్రీనివాస గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Trump Vs Denmark: అమెరికాకు డెన్మార్క్ వార్నింగ్.. గ్రీన్‌లాండ్ జోలికొస్తే తగ్గేదేలే అంటోండి..

