Homeఆంధ్రప్రదేశ్Rajampet: ఇంట్లోకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్‌

Rajampet: ఇంట్లోకి దూసుకెళ్లిన ఇసుక టిప్పర్‌

అర్ధరాత్రి ప్రమాదం.. తృటిలో తప్పిన ప్రాణాపాయం

- Advertisement -

రాజంపేట, తెలుగు ప్రభ :రాజంపేట నియోజకవర్గంలోని ఊటుకూరులో మరోసారి ఇసుక టిప్పర్‌ ప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి సమయంలో వేగంగా వచ్చిన ఇసుక టిప్పర్‌ కొండగారి నాగయ్య ఇంటి వసారాలోకి దూసుకెళ్లింది. తెల్లవారుజామున సుమారు 1.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

అర్ధరాత్రి వేళ ఇంట్లోకి టిప్పర్‌ దూసుకురావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం.ఊటుకూరులో ఇసుక టిప్పర్ల కారణంగా మరోసారి ప్రమాదం జరగడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. నివాస ప్రాంతాల్లో ఇసుక టిప్పర్ల రాకపోకలపై అధికారులు దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News