Sunday, January 18, 2026
Homeఆంధ్రప్రదేశ్Ap: పల్లెకు బయల్దేరిన పట్టణం...హైవే పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

Ap: పల్లెకు బయల్దేరిన పట్టణం…హైవే పై భారీగా ట్రాఫిక్‌ జామ్‌!

Alert for Sankranti travelers:సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో నగరాల్లో నివసించే ప్రజలు పెద్ద ఎత్తున తమ స్వగ్రామాల వైపు ప్రయాణం చేస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో పాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో ఈసారి ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగింది. ఇప్పటికే శుక్రవారమే అనేక పాఠశాలల్లో ముందస్తుగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు. దీంతో సాయంత్రం నుంచే పిల్లలతో కలిసి కుటుంబాలు ఊళ్లకు బయలుదేరడం మొదలుపెట్టాయి. శనివారం నుంచి అధికారికంగా సెలవులు అమల్లోకి రావడంతో నగరంలోని ప్రధాన ప్రయాణ కేంద్రాలు ఒక్కసారిగా జనంతో నిండిపోయాయి.

- Advertisement -

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి రాత్రి వరకూ బస్సుల కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ముందస్తు రిజర్వేషన్ లేకుండా వచ్చిన వారు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు. రైల్వే స్టేషన్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్లాట్ ఫామ్స్ ప్రయాణికులతో నిండిపోవడంతో భద్రతా సిబ్బంది అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. కుటుంబాలతో పాటు ఒంటరిగా ప్రయాణించే వారు కూడా అధికంగా ఉండటంతో స్టేషన్లలో రద్దీ మరింత పెరిగింది.

Also Read: https://teluguprabha.net/andhra-pradesh-news/ap-tet-2025-results-announced/

వీకెండ్, స్కూళ్ల సెలవులు..

వీకెండ్, స్కూళ్ల సెలవులు ఒకేసారి రావడం వల్ల పట్టణాల నుంచి గ్రామాల వైపు వెళ్లే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తెలంగాణలోని వివిధ జిల్లాలకు అలాగే ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలకు వెళ్లే మార్గాలు బాగా రద్దీగా మారాయి. చాలామంది తమ సొంత వాహనాల్లోనే ప్రయాణం చేయడం వల్ల ప్రధాన రహదారులపై వాహనాల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఫలితంగా నగరం నుంచి బయలుదేరే రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.

విజయవాడ వైపు వెళ్లే..

హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే జాతీయ రహదారి మీద భారీగా ట్రాఫిక్ నమోదవుతోంది. పంతంగి టోల్ గేట్ వద్ద వాహనాలు వరుసగా నిలిచిపోవడంతో ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కార్లు బస్సులు లారీలు ఒకేసారి రావడంతో ఈ ప్రాంతంలో కదలిక మందగించింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు రంగంలోకి దిగినా రద్దీ కారణంగా ప్రయాణ సమయం ఎక్కువవుతోంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు ముందస్తుగా ప్రణాళిక చేసుకుని బయలుదేరాలని అధికారులు సూచిస్తున్నారు.

ట్రాఫిక్ సమస్యలు..

గ్రామాలకు వెళ్లే ఉత్సాహంతో నగరవాసులు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. ముఖ్యమైన జంక్షన్ల వద్ద వాహనాల కదలిక నెమ్మదిగా సాగుతోంది. నగర పరిధి దాటే వరకు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణం మరింత ఆలస్యం అవుతోంది. అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాల వైపు వాహనాలను మళ్లిస్తున్నారు.

సంక్రాంతి పండుగకు ఊర్లకు వెళ్లే వారు తమ ఇళ్ల భద్రతపై కూడా దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు. పండుగ రోజుల్లో నగరాల్లో ఇళ్లలో ఎవరు లేకపోవడం వల్ల దొంగతనాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అందుకే గ్రామాలకు వెళ్లే వారు తప్పనిసరిగా తమ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. అలా చేస్తే ఆ ప్రాంతాల్లో గస్తీని మరింత పెంచి భద్రతను మెరుగుపరుస్తామని పోలీసులు తెలిపారు.

సీసీ కెమెరాలు..

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు నగలు వంటి వాటిని సురక్షితంగా భద్రపరచుకోవాలని సూచిస్తున్నారు. సీసీ కెమెరాలు ఉన్న వారు అవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని ముందుగానే పరిశీలించుకోవాలని చెప్పారు. విద్యుత్ సరఫరా నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇంటి చుట్టుపక్కల నివసించే వారికి సమాచారం ఇవ్వడం ద్వారా అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయవచ్చని అధికారులు తెలిపారు.

Also Read:  https://teluguprabha.net/andhra-pradesh-news/ttd-approves-new-posts-promotions-employees/

సెంట్రల్ లాక్ సిస్టమ్..

గ్రామాలకు వెళ్లే వారు తమ ఇళ్లలో సెంట్రల్ లాక్ సిస్టమ్ లేదా అలారం ఏర్పాటు చేసుకుంటే మరింత భద్రత ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. పండుగ సమయంలో ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి నేరాల నియంత్రణపై దృష్టి సారిస్తున్నామని వెల్లడించారు. ఎక్కువగా ప్రయాణాలు జరుగుతున్న ప్రాంతాల్లో పెట్రోలింగ్ ను పెంచినట్లు తెలిపారు. ప్రజలు సహకరిస్తే పండుగను ప్రశాంతంగా జరుపుకోవచ్చని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News