Saturday, January 11, 2025
Homeఆంధ్రప్రదేశ్Chandrababu: సంక్రాంతి రద్దీ.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

Chandrababu: సంక్రాంతి రద్దీ.. అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

సంక్రాంతి(Sankranti) పండుగకు సొంతూళ్లు వెళ్లేందుకు ప్రజలు బారులు తీరారు. దీంతో హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో సీఎం చంద్రబాబు(Chandrababu) ఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల బస్సులతో ప్రయాణికులను ప్రధాన పట్టణాల నుంచి పల్లెలకు పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఫిట్‌నెస్‌ ఉన్న బస్సులను మాత్రమే ఇందుకోసం వినియోగించాలని సూచించారు. దీని వల్ల సురక్షితంగా ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్తారని అభిప్రాయపడ్డారు.

- Advertisement -

కాగా సంక్రాంతి పండుగకు తెలంగాణ సహా ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల నుంచి ఏపీకి పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో ప్రధాన నగరాలైన విజయవాడ, గుంటూరు, విశాఖ, రాజమహేంద్రవరం, నెల్లూరు, తిరుపతి, ఒంగోలు, కర్నూలు, అనంతపురం సహా పలు నగరాల్లో బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. లక్షలాది మంది ప్రయాణికులు స్వగ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ బస్సులు ఉపయోగించాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News