Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్School shoes: 1-10 తరగతి విద్యార్థులందరికీ షూస్

School shoes: 1-10 తరగతి విద్యార్థులందరికీ షూస్

నల్ల రంగు షూలు, రెండు జతల సాక్స్‌లు

జూన్ 5వ తేదీ నాటికి అన్ని షూల (బూట్లు) రవాణా పూర్తి చేయాలని, జూన్ 12వ తేదీ నాటికి పాఠశాలలు పునఃప్రారంభమయ్యే రోజున పిల్లలందరికీ స్కూల్ కిట్ అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్లడించారు. 1 నుండి 10వ తరగతి వరకు చదువుకునే విద్యార్థినీ విద్యార్థులందరికీ నల్ల రంగు బూట్లు, రెండు జతల సాక్స్‌లు అందించాలని నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

స్కూల్ బ్యాగు ఫ్యాక్టరీల మాదిరిగానే ఈసారి షూ తయారు చేసే ఫ్యాక్టరీలను సందర్శించామని పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా షూలు 16 సెంటీమీటర్ల నుండి 30 సెంటీమీటర్ల పాదాల పరిమాణానికి అనుగుణంగా ఉండాలని సిబ్బందికి సూచించామన్నారు. షూ యొక్క పైభాగం 1.8mm +- 0.22 మిమీ మందంతో పాలివినైల్ క్లోరైడ్ (PVC) మెటీరియల్‌తో తయారు చేయాలని ఆదేశించారు. అదే విధంగా 0.85 +- 0.10 గ్రాములు/సెం.మీ³ సాంద్రత కలిగిన పదార్థంతో సోల్ భాగాన్ని తయారు చేయాలని తెలిపారు.

ఉత్పత్తి చేసిన వస్తువు నాణ్యత, సరఫరా విషయంలో కంపెనీ పరువే కాదు అధికారుల పరువు కూడా ముడిపడి ఉంటుందని కార్మికులకు వివరించినట్లు ఆయన వెల్లడించారు. షూ తయారు చేసేది కేంద్రీకృత పరిశ్రమ కాబట్టి, నాణ్యత, సరఫరాలో ఎటువంటి లోపం ఉన్నా ప్రధాన కార్యదర్శిపై ఆ ప్రభావం పడుతుందని, అందువల్ల వస్తువు తయారీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వారికి చెప్పినట్లు ప్రవీణ్ ప్రకాష్ వివరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News