Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Kurnool: కొత్త రుచులను అందించిన సీ ఫుడ్ ఫెస్టివల్

Kurnool: కొత్త రుచులను అందించిన సీ ఫుడ్ ఫెస్టివల్

ఆంధ్రప్రదేశ్లో మత్స్య సంపద వినియోగాన్ని పెంచేందుకు అందుకు అవసరమైన ప్రత్యామ్నాయ మార్కెటింగ్ సౌకర్యాలను విస్తృతపరచాలని లక్ష్యంతో కర్నూలులో మూడు రోజులపాటు సీ ఫుడ్ ఫెస్టివల్ ను బెంగుళూరు, హైదరాబాద్ జాతీయ రహదారిని అనుకుని ఉన్న రావూరి గార్డెన్ ఫంక్షన్ హాల్ లో మత్స్యశాఖ జెడి శ్యామల ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్ సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు వేడుకల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని సీ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. రెండవ రోజు వేడుకల్లో కర్నూలు నగరానికి చెందిన వివిధ కళాశాల విద్యార్థిని, విద్యార్థులతో పాటు శాంతిరాం మెడికల్ కళాశాల న్యూట్రిషన్ డాక్టర్ కృష్ణారావు, జిల్లా మత్స్య సహకార సంఘాల సభ్యులు పాల్గొన్నారు. నగరవాసులు సీ ఫుడ్ ఫెస్టివల్ కు పోటెత్తారు. చేపలు, రొయ్యలు ఆహారంగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలపై డాక్టర్ ఎం కృష్ణారావు సీ ఫుడ్ ఫెస్టివల్ కి వచ్చిన విద్యార్థిని విద్యార్థులకు నగర వాసులకు అవగాహన కల్పించారు. చివరి రోజైనా మూడవరోజు ఆదివారం పైగా సెలవు రోజు కావడంతో చేపలు, రొయ్యల వంటకాలను నగరవాసులు పెద్ద ఎత్తున ఫుడ్ ఫెస్టివల్ కు తరలివచ్చి చేపల, రొయ్యల ఆహార రుచులను ఆస్వాదించారు. చేపల ఫ్రై, బిర్యానీ, పులుసు, ప్రాన్స్ బిర్యానీ, రొయ్యల వేపుడును 399లకే అన్ లిమిటెడ్ ప్యాకేజ్ గా విక్రయించారు. వంటకాలు నోరూరించడంతో ఆహార ప్రియులు ఎగబడ్డారు. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి వచ్చిన సందర్శకులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రకరకాల చేపలతో ఉన్న స్టాల్స్ నగర వాసులను ఆకట్టుకున్నాయి.

- Advertisement -

చివరి రోజు మత్స్య శాఖ ఆధ్వర్యంలో నృత్య పోటీలను ఏర్పాటు చేసి పాల్గొన్న వారికి మెమొంటోలతో సత్కరించారు. మూడు రోజులపాటు కొనసాగిన సీ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమం విజయవంతం కావడానికి కృషిచేసిన పలువురు మత్స్య శాఖ సిబ్బందికి జాయింట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్, నంద్యాల మత్స్యశాఖ అధికారి రాఘవరెడ్డి, కడప జిల్లా మత్స్యశాఖ అధికారి నాగలింగమాచారి, అనంతపురం సత్యసాయి జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి, అన్నమయ్య జిల్లా మత్స్యశాఖ అధికారి సుస్మిత, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రాజేష్, తదితర మత్స్యశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News