Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Seediri appalaraju: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేతకు అస్వస్థత

Seediri appalaraju: మాజీ మంత్రి, వైసీపీ కీలక నేతకు అస్వస్థత

Seediri appalaraju| అధికారం కోల్పోయిన దగ్గరి నుంచి వైసీపీకి బ్యాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. కేసులు, అరెస్టులతో ఆ పార్టీ కీలక నేతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొంతమంది ఆడపాదడపా ప్రెస్‌మీట్లు పెడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరికొంతమంది అయితే అసలు అడ్రస్ లేరు. దీంతో నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేసే కరువయ్యారు. అయితే ఇటీవల శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ వర్గాలు బాహబాహాకి దిగారు. స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. ఈ వివాదం జరుగుతుండగానే ఆయన అస్వస్థతకు గురయ్యారు.

- Advertisement -

ఆయన గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఇంట్లో వ్యాయామం చేస్తున్న సమయంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యార ట. దీంతో వెంటనే అప్పలరాజును ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుండె సంబంధిత, సీటీ స్కాన్ పరీక్షలు చేశారు. అయితే ఆయనకు ఎలాంటి ఆరోగ్యసమస్యలు లేవని.. వైద్యులు తెలిపారు. కానీ 24 గంటల పాటు అబ్జర్వేషన్‌లో పెడుతున్నట్లు తెలిపారు. దీంతో ఆయన ఆసుపత్రిలోనే ఉన్నారు. విషయం తెలుసుకున్న కార్యకర్తలు ఆయన ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు. త్వరగా కోలుకుని రాజకీయ కార్యకలాపాల్లో యాక్టివ్‌గా పాల్గొనాలని కోరుకుంటున్నారు.

కాగా 2019 ఎన్నికల్లో పలాస నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై ఆయన విజయం సాధించారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ విజయం సాధించడంతో అప్పటి సీఎం జగన్ కంట్లో పడ్డారు. దీంతో ఆయనకు మంత్రిపదవి కేటాయించారు. అయితే అప్పటి నుంచి టీడీపీ వర్గీయులపై అప్పలరాజు వర్గీయులు పైచేయి సాధించారు. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం అప్పలరాజుకు పరాభవం తప్పలేదు. ఆయనపై గౌతు శిరీష భారీ మెజార్టీతో గెలిచి ప్రతీకారం తీర్చుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News