CM Chandrababu Women’s Day: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల ఆర్థిక వృద్ధే లక్ష్యంగా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో కీలక ఒప్పందాలు జరిగాయి. వేర్వేరు సంస్థలతో స్వయం సహాయక సంఘాల కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్), పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఒప్పందాలు చేసుకున్నాయి. కీలక ఒప్పందాలు ఇవే..
- Advertisement -
- సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి మహిళలకు శిక్షణ ఇచ్చేలా ఒప్పందం
- 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చేలా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం
- సీవీడ్ కల్చర్‌లో మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం సీఎస్ఐఆర్‌తో ఒప్పందం
- సంఘాల మహిళలు ఈ సీవీడ్‌లను వివిధ రకాల ఉత్పత్తుల తయారీ కోసం ఒప్పందం
- వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి కేరళకు చెందిన అమృత వర్సిటీ పీఠంతో ఒప్పందం
- మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పనపై ఎక్స్‌ఎల్ఆర్ఐ సంస్థతో ఒప్పందం
- పొదుపు చేసిన మెుత్తాలతో వ్యాపారాలు చేసేందుకు ఐఎస్‌బీతో సెర్ప్ ఒప్పందం
- చేనేత, ఇతర ఫ్యాబ్రిక్ ఉత్పత్తుల మార్కెటింగ్‌కు ఆప్కోతో ఒప్పందం
- డిజిటల్ కామర్స్, ఎఫ్‌పీవో ఉత్పత్తుల మార్కెటింగ్‌పై సాయం కోసం ఐఐఎం విశాఖతో ఒప్పందం

