Summer Heat in AP: తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో ప్రజలు అలమటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లో నైరుతి రుతుపవనాల రాక కొంత ఉపశమనం కలిగిస్తున్నా.. ఓవైపు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) హెచ్చరిస్తోంది.
Also Read: https://teluguprabha.net/cinema-news/record-views-for-peddhi-trailer/
తీవ్రమైన వడగాలులు: రాష్ట్రంలో రోజురోజుకీ ఎండ తీవ్రత పెరుగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీస్తాయని హెచ్చరించింది. రేపు 71 మండలాల్లో, ఎల్లుండి 310 మండలాల్లో ఈ ప్రభావం ఉంటుందని తెలిపింది.
అత్యధిక ఉష్ణోగ్రతలు: బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల వకకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని APSDMA స్పష్టం చేసింది.
Also Read: https://teluguprabha.net/national-news/vijay-mullivaikkal-tweet-controversy-neo-dravidian-politics/
గరిష్ఠ ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు ప్రయాణాలు సాధ్యమైనంతగా తగ్గించుకోవాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు బయటకు వెళ్లొద్దని చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్‌కు గురి కాకుండా తరచుగా జ్యూస్‌లు, తాగు నీరు, కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవాలంటున్నారు. బయటకు వెళ్లినప్పుడు స్కార్ఫ్ లేదా గొడుగు తప్పనిసరి అని ఎక్కువగా కాటన్ దుస్తులు ధరించాలని సూచనలు చేశారు.

