Sunday, July 7, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: పేదల మేలు కోరే 'జగనన్న సురక్ష'

Shilpa: పేదల మేలు కోరే ‘జగనన్న సురక్ష’

సర్వీస్ ఛార్జ్ లేకుండా 11 ధృవపత్రాలు

నంద్యాల పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 7,8, 10,12 వార్డులలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి,ఎంఎల్సి ఇషాక్ బాషా, పాల్గొని వార్డు ప్రజల నుండి వచ్చిన సమస్యలను తెలుసుకొని జగనన్న సురక్ష కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను పరిశీలించి సర్టిఫికెట్స్ ను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమార్థం జగనన్న సురక్ష అనే వినూత్నమైన, విప్లవాత్మకమైన కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని అన్నారు.

- Advertisement -

గతంలో ఏ ధ్రువపత్రం కావాలన్నా కార్యాలయాలు, అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగేవారని గుర్తు చేశారు. ఇప్పుడు ఇంటికే వద్దకే ధ్రువపత్రాలను అందజేస్తున్నామని అన్నారు. పలు సేవల కోసం, పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువపత్రాలను అందించామని. సంక్షేమ పథకాలు, ప్రజా సమస్యలు సంతృప్తిస్థాయిలో పరిష్కారమే లక్ష్యంగా నెల రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్విస్తున్నట్లు తెలిపారు. జనన, మరణ, కుల, సిసిఆర్‌సి, రేషన్‌ కార్డు డివిజహోన్‌, హౌస్‌ హోల్డ్‌ డివిజన్‌, ఆదాయం తదితర 11 రకాల ధ్రువీకరణపత్రాలను సర్వీస్‌ ఛార్జ్‌ లేకుండా ఉచితంగా అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీసా, మున్సిపల్ కమిషనర్ రవీంద్రారెడ్డి, కౌన్సిలర్స్ మజీద్, శ్యామ్సుందర్ లాల్, కలాం బాషా, తౌహీద్, కోఆప్షన్ సభ్యులు సలాంముల్లా, 12వ ఇంచార్జ్ గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ కత్తి శంకర్, నిజాం ముద్దీన్, మార్కెట్ కలాం, మాజీ కౌన్సిలర్ జాకీర్ హుస్సేన్, అనిల్ అమృతరాజ్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News