నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే నా ధ్యేయమని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల నందు ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. మెగా జాబ్ మేళా బహిరంగ సభలో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ మన శ్రీశైలంలో నియోజకవర్గంలో ఇప్పటివరకు మూడుసార్లు మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించి ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించామన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్యేగా గడపగడప కార్యక్రమం వెళ్ళినప్పుడు చాలామంది యువతకు ఉద్యోగాలు కావాలని కోరారని వాటిని దృష్టిపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, మెగా జాబ్ మేళా లో 13 రకాల కంపెనీలు వచ్చాయని ఇక్కడికి వచ్చిన యువత యువకులు అందరూ మీ యొక్క క్వాలిఫికేషన్ బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. మీ చదువుకు ఎంతో మీ తల్లిదండ్రులకు కష్టపడి ఉంటారని యువతీ యువకులు నిరుద్యోగులు అందరూ వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని దాని ద్వారా మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని తెలియజేశారు. శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్ప భువనేశ్వర్ రెడ్డి , శ్రీధర్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి వెంకటేశ్వర డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్మన్ ఆసియా మురుఫ్ , ఎంపీపీ తిరుపాలమ్మ మెగా జాబ్ మేళా గురించి మాట్లాడుతూ మన నియోజకవర్గానికి ఇలాంటి జాబ్ మేళా అవకాశాలను ఎమ్మెల్యే చాలా తెచ్చారని, ఈరోజు ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు చేశారని ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకుని మీరు మంచి ఉన్నత స్థాయి పొందాలని తెలియజేశారు. నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతుందని అదేవిధంగా నిరుద్యోగమే కాకుండా నియోజకవర్గం గ్రామాలలో, పట్టణాలలో అభివృద్ధిలో దూసుకబోతుందని, అలాగే ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చేసే సేవా కార్యక్రమాల గురించి కొనియాడారు. మెగా జాబ్ మేళా కార్యక్రమానికి న పార్టీ మండల పట్టణ అధ్యక్షులు ఆత్మకూరు మున్సిపల్ చైర్మన్ ఎంపీపీ , ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిలర్లు,13 కంపెనీలకు సంబంధించిన హెచ్ఆర్ మేనేజర్లు, వేలాది నిరుద్యోగ యువతీ యువకులు, వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.
Shilpa: నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే నా ధ్యేయం
ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి సొంత ఖర్చులతో జాబ్ మేళా ఏర్పాటు చేశారు, ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువతి యువకులు సద్వినియోగం చేసుకోండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES