Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: నా క్యారెక్టర్ ఏంటో మీ నాయనని అడుగు

Shilpa: నా క్యారెక్టర్ ఏంటో మీ నాయనని అడుగు

నాకు చీటింగ్ చక్రపాణి పేరు పెట్టానన్నావ్ చాలా సంతోషం, మీ చీటింగ్ స్కూల్లో 6 ఏళ్ల పాటు చదువుకున్నా, నేను చీటింగ్ మనిషి అయితే ఒకసారి జిల్లా అధ్యక్ష పదవి, రెండు సార్లు ఎమ్మెల్సీ పదవి ఎలా ఇచ్చారు? ఎవరిని చీట్ చేసి నా సొంత పని చేసుకున్నానో రుజువు చెయ్, రాజకీయ సన్యాసం తీసుకుంటా, వర్థన్ బ్యాంకు పెట్టి నూరుకోట్లు మోసం చేశాను అన్నావు నిరూపించగలవా? ఆ బ్యాంక్ కార్యాలయ ప్రారంభానికి పిలిస్తే వెళ్లా, రుణాలు తీసుకోండి అని చెప్పినాను అంతే గాని, డిపాజిట్లు చేయమని చెప్పినానా? అంటూ శిల్పా చక్రపాణి మండిపడ్డారు. వర్ధన్ బ్యాంకు తో నాకు సంబంధం ఉంటే, వేల కోట్లు ముంచేసిన కృషి బ్యాంకుకు తెల్గీ స్టాంప్ కుంభకోణాలతో మీ నాయనకు కూడా సంబంధం ఉన్నట్టే కదా? నా క్యారెక్టర్ ఏంటో మీ నాయనని అడుగు అంటూ శిల్పా లోకేష్ కు సవాలు విసిరారు. మీ నాయన చంద్రబాబును అడిగితే నా క్యారెక్టర్ ఏంటో చెబుతాడు. పత్తికొండలో ఆనాటి డిప్యూటీ సీఎంను పక్కనపెట్టి బస్సులోకి నన్ను పిలిపించుకున్నాడు. జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలను కొనేందుకు భేరసారాలు జరపమని నన్ను ప్రోత్సహించలేదా..? అంటూ లోకేష్ ను శిల్పా కడిగేశారు.

- Advertisement -

రాష్ట్రంలో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను మీ నాయన సంతలో పశువుల్లాగా బేరమాడి కొనలేదా? ఇప్పుడు నీ పక్కనే ఉన్న బుడ్డా రాజశేఖర్ ని 18 కోట్లు పెట్టి కొన్నది వాస్తవం కాదా.? 2015లో ఎమ్మెల్సీ ఎలక్షన్ల ఖర్చు మొత్తం పార్టీయే పెడుతుంది అని చెప్పి నన్ను రంగంలోకి దించి ముంచేసావ్. దీనికి సాక్ష్యం మీ అచ్చెన్నాయుడే అంటూ వెల్లడించారు. ఎవరు అబద్ధాలు చెబుతున్నారో ఎవరు చీటింగ్ చేస్తున్నారో తేల్చుకుందామంటే నేను సిద్ధం.. ఇద్దరం మహానంది కోనేరులో మునిగి ప్రమాణం చేద్దాం రా అంటూ ఆయన సవాలు విసిరారు. నేను టిడిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు… జగన్ లక్ష కోట్ల దొంగ అంటూ ప్రచారం చేయమన్నాడు, రాష్ట్ర బడ్జెట్ కూడా అంత లేదు కదా అలా చెప్తే ఏం బాగుంటుంది..?” అని నేను అడిగితే.. పదే పదే ప్రచారం చేస్తే అదే నిజమని జనాలు నమ్ముతారు..” అంటూ మాకు ఊదర కొట్టేవాడన్నారు.

ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనేటువంటి లోఫర్ బుద్ధి ఎవరిది? అందుకే నేను నీకు పేరు పెడుతున్న ఇవాల్టి నుంచి నీ పేరు లోఫర్ లోకేష్, ఇకపై నీవు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా నిన్ను లోఫర్ లోకేష్ అనే పిలుస్తారు. నీకు ఇది నేను ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అంటూ ఎమ్మేల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News