శ్రీశైలం మండలం సుండిపెంటలో ఎమ్మెల్యే పర్యటనలో భాగంగా సుండిపెంటలోని ప్రాజెక్ట్ హైస్కూలు ఓల్డ్ స్టూడెంట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ప్రారంభించారు. ఆటగాళ్లతో మాట్లాడి గేమ్స్ లో రాష్ట్ర, దేశ స్థాయిలో రాణించాలన్నారు. రాష్ట్ర స్థాయిలో జరిగే టోర్నమెంట్ కు ఎమ్మెల్యే వ్యక్తిగతంగా ఒక లక్ష రూపాయలు ప్రకటించారు. అనంతరం టోర్నీని ప్రారంభించిన శిల్ప చక్రపాణిరెడ్డి క్రికెట్ బ్యాట్ పట్టుకుని కొద్దీ సేపు సరదాగా ఆటగాళ్లతో ఆడి, కొద్దిసేపు వాళ్ళతో ముచ్చటించారు.
