బండిఆత్మకూరు మండలంలోని భోజనం గ్రామంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం నాయకులు శిల్పా భువనేశ్వర్ రెడ్డిలకు భోజనం గ్రామ వైఎస్సార్సీపీ నాయకులు సర్పంచ్ బారెడ్డి భాస్కర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చరిత్రాత్మక ఘట్టమన్నారు. గ్రామాలకే స్పెషలిస్ట్ వైద్యులు తరలివచ్చి, వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం, రాష్ట్రంలో ఎన్నడూ లేదని చెప్పారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వైద్య పరీక్షలు చేసి, రోగులకు మెరుగైన వైద్యమందించాలని వైద్య శాఖ బృందానికి తెలియజేశారు. జగనన్న ఆరోగ్య సురక్ష గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దే రెడ్డి చిన్న సంజీవరెడ్డి,మండల జేసీఎస్ కన్వీనర్ ముడిమేల పుల్లారెడ్డి, మాజీ ఎంపీపీ దేసు వెంకటరామిరెడ్డి సర్పంచ్ బారెడ్డి భాస్కర్ రెడ్డి,
మార్కెట్ యార్డ్ డైరెక్టర్ విక్రమ్ సింహ నాయక్, గోవింద రెడ్డి, ఎంఎల్ ఓ పార్థసారథి రెడ్డి,
సంతజుటూరు భూమా రఘునాథ్ రెడ్డిలు పాల్గొన్నారు.
Shilpa Chakrapani: జగనన్న ఆరోగ్య సురక్ష పేదల రక్ష
అనారోగ్యంతో బాధపడుతున్నవారంతా వైద్య సేవలు ఉపయోగించుకోండి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES