బండిఆత్మకూరు మండల కేంద్రంలో 100వ రోజుకు చేరింది గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే శిల్పాకు గ్రామ నాయకులు ప్రజలు భారీ గజ మాలతో సన్మానించారు. అధిక సంఖ్యలో మహిళలు ప్రజలు పాల్గొని హారతులతో గ్రామంలోకి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, అనంతరం గ్రామంలో 100 వ రోజుకు చేరుకున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 100 కేజీల కేక్ కోసి ఎమ్మెల్యే 100 రోజుల పండుగలా చేసుకున్నారు. అందరికీ మిఠాయిలు కేక్ లు పంచి 100వ రోజు సంబరాలు జరుపుకొన్నారు. అనంతరం శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్ కే దక్కుతుందని, జగనన్న అందించిన సంక్షేమ పథకాలే మళ్లీ ఆయనను గెలిపిస్తాయని , మళ్ళీ వచ్చేది జగనన్న ప్రభుత్వమేనని ఎమ్మెల్యే అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ప్రతి ఒక్కరూ జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు . సాయంత్రం నాలుగుగంటల నుండి రాత్రి 9 గంటల వరకు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగించారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వరరెడ్డి, ఎంపిపి దేరెడ్డి చిన్నసంజీవరెడ్డి ,మండల కన్వీనర్ బారెడ్డి శ్రీనివాస రెడ్డి, జేసీఎస్ కన్వినర్ ముడిమెల పుల్లారెడ్డి, సర్పంచి వై.సంధ్య, మాజీ ఎంపిపి దేసు వెంకటరామిరెడ్డి, రాజంరెడ్డి సుజాతమ్మ మాజీ సర్పంచి, చిన్న సుబ్బారెడ్డి, అవుటాల నాగేశ్వరరెడ్డి, నారాయణ రెడ్డి (బాబు రెడ్డి), సీమ సుబ్బారెడ్డి, APSPDCL డైరెక్టర్ శశికళ రెడ్డి, దీపు రెడ్డి, సింగిల్విండో ప్రసిడెంట్ భూరం శివలింగం, విక్రమ సింహానాయక్, వెంగళరెడ్డిపేట సోమేశ్వరరెడ్డి, పార్నపల్లి సర్పంచి షబ్బీర్ అహమ్మద్ ,ఉప సర్పంచి రామలింగేశ్వరరెడ్డి , ఎంపీడీఓ వాసుదేవగుప్తా , తహసీల్ధారు ఉమారాణి ,ఎసై టి.బాబు ,ఏపీఓ వసుధ ,ఎపిఎం రాజశేఖరరెడ్డి ,విద్యుత్ శాఖ ఏ ఈ ప్రసాదరెడ్డి ,పంచాయితీ కార్యదర్శినటరాజ్ , ,పరమటూరు సర్పంచి జగన్మోహన్ రెడ్డి ,కాకనూరు సర్పంచి మహేశ్వరరెడ్డి ,ఎంఏఓ స్వాతి ,కాకనూరు వెంకటసుబ్బయ్య ,ఎర్రగుంట్ల పుల్లయ్య ,హోసింగ్ ఏ ఈ సుంకిరెడ్డి , ,గ్రామ వాలంటరీలు ,సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు ,వివిధ గ్రామాల వైసీపీ కార్యకర్తలు ,ప్రజలు పాల్గొన్నారు.
Shilpa: ‘గడప గడప’లో ఎమ్మెల్యే సెంచరీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES