పేద ప్రజలకు రక్షగా జగనన్న సురక్ష కార్యక్రమం నిలుస్తుందని, నంద్యాల నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ భాష కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన నాలుగు సంవత్సరాల్లో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందని వారికి, అలాగే ప్రజలకు అవసరమైన కీలక దృవపత్రాలను ఎటుంటి రుసుము చెల్లించనవసరం లేకుండా జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఆయా గ్రామ, వార్డు సచివాలయా పరిధిలో సంబంధిత అధికారులు ప్రత్యేక క్యాంప్లు నిర్వహించి సమస్యలను పరిష్కరిస్తూ, పధకాలకు చెందిన కీలక సర్టిఫికెట్లను మంజూరు చేసే బృహత్తర కార్యక్రమానికి సీఎం జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిషోర్రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని నంద్యాల నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే ఆయా గ్రామ, వార్డు సచివాలయా పరిదిలో వాలంటీర్లు, గృహసారధులు, ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆవగాహన కల్పింస్తున్నారని తెలిపారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించి నంద్యాల నియోజకవర్గ పరిదిలో చేపడుతున్న జగనన్న నురక్ష కార్యక్రమ వివరాలను వెల్లడించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాల లబ్ధి పొందాలన్న లక్ష్యంగా, ప్రతి ఇంటిలో ప్రభుత్వ సేవలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలన్న చిత్తశుద్ధితో వైఎస్సార్సీపీ ప్రభుత్వం జగనన్న సురక్ష అనే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అర్హత ఉన్నా అవసరమైన ధృవపత్రాలు లేవన్న కారణం చేత పథకాలు అందని వారికి స్వాంతన అందిస్తూ ప్రజలకు అవసరమై కీలక 11 ధృవపత్రాలను అందించే కార్యక్రమానికి నాంది పలకారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1వ తేది నుండి 30రోజుల పాటుగా గ్రామ, వార్డు సచివాలయా పరిదిలో ప్రత్యేక క్యాంప్లలో మండల స్థాయి అధికారులైన తహసీల్దార్, ఈఓపీఆర్డీ ఒక టింగా, ఎంపిడిఓ, డిప్యూటీ తహసీల్దార్ ఒక టీంగా ఏర్పడి అక్కడికక్కడే పథకాల సమస్యలను పరిష్కరిస్తారన్నారు. ఎటువంటి సర్వీస్ ఫీజులు లేకుండా జనన, మరణ, కుల, ఆదాయ, కుటుంబ, వివాహ దృవీకరణ పత్రాలు, మ్యుటేషన్, ఆధార్కు ఫోన్నెంబర్ అనుసంధానం, పంటసాగు కార్డు, కొత్త రేషన్కార్డు, లేదా రేషన్ కార్డులో సభ్యుల విభజన, ప్రభుత్వ డేటాకు సంబంధించిన కుటుంబ వివరాల్లో మార్పులు చేర్పులు వంటి 11 రకాల దృవపత్రాలను అందించడంతో పాటుగా అవసరమైన సర్టిఫికెట్లను అందించనున్నారని తెలిపారు. ఇప్పటికే ఆయా గ్రామ, వార్డు సచివాలయల పరిదిలోని వాలంటీర్లు గృహాలను సందర్శించి అర్హులై ఉన్న లబ్ధి దారులను గుర్తించి సమస్య పరిష్కారానికి సంబంధించిన పత్రాలను సేకరిస్తారన్నారు. ఆ పత్రాలను తీసుకెళ్లి సచివాలయాల్లో సమర్పించి టోకెన్ నెంబర్, సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వాటికి సంబంధించిన వివరాలను లబ్ది దారుని ఇంటికి వెళ్లి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఏ తేదీలో ఆయా వార్డు గ్రామ సచివాలయాల్లో క్యాంప్ లు ఏర్పాటు చేసేది ముందస్తుగా లబ్ధిదారులకు తెలియజేసి. క్యాంప్కు వాలంటీర్లు, గృహసారధులు దగ్గరుండి వారిని క్యాంప్ వద్దకు తీసుకెళ్లి ఆ సమస్యను పరిష్కారమయ్యేలా తోడుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో లక్షల మంది భాగస్వామ్యులు అవుతూ జగనన్న ప్రభుత్వానికి పేదలకు తోడుగా ఉంటారని, జగనన్న సురక్ష కార్యక్రమం ఒక ఉద్యమంలా సాగుతుందన్నారు. జగనన్న పాలన అంటే పారదర్శకతకు పర్యాయపదం అని, గుండె గుండెకూ జగనన్న సుపరిపాల అందించడమే లక్ష్యం అన్నారు. ఎవరి దగ్గరకు పోవాల్సిన అవసరం లేదు. అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నాలేదని, మీ అందరి ప్రభుత్వమే మీ జగనన్న ప్రభుత్వం మీ వద్దకు వస్తుందని సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఇటువంటి అనే ప్రతిష్టాత్మక కార్యక్రమాలను సీఎం జగన్మోహన్రెడ్డి చేపడుతుంటే 40 సంవత్సరాల రాజకీయ అనుభవం, 14 సంవత్సరాల సీఎంగా చేసిన చంద్రబాబునాయుడు: రాష్ట్రంలో జగనన్న అమలు చేస్తున్న పథకాలను కాపీకొడుతూ సరికొత్తగా తాను ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను చేపడతానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డి ప్రజలకు సంక్షేమం అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రీలంకలా మారుతుందని విమర్శించిన చంద్రబాబు తాను అమలు చేస్తానన్న పథకాల వల్ల రాష్ట్రం సింగపూర్ ఎలా మారుతుందో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. సొంత ఆలోచనలు చేయలేని చంద్రబాబు, ఇటు వైఎస్సార్సీపీ పథకాలు, బీజేపీ పథకాలు, కాంగ్రెస్పార్టీ వారి పథకాలను కాపీ కొట్టి తానే ఈ పథకాలను కనిపెట్టానని చెప్పడం హాస్యాస్పందంగా ఉందన్నారు. అమ్మకు అన్నం పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాఅన్నట్లు విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న 14 సంవత్సరాల్లో చెయ్యలేని అభివృద్ధి. ఇప్పుడు చేస్తానని చెప్పడం చోద్యంగా ఉందన్నారు. జగనన్న పాలన, సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, పొరుగు రాష్ట్రాలు అమలు చేసేందుకు సిద్ధం అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కెఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాషావలి, దృ శ్యకలల డైరెక్టర్ సునీత అమృతరాజ్, బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ డా. శశికళరెడ్డి, ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సిద్దం శివరాం, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.