Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Shilpa: 'జగనన్న సురక్ష' కార్యక్రమంలో ఎమ్మెల్యే

Shilpa: ‘జగనన్న సురక్ష’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

సమస్యలు ఇంకా పెండింగ్ లో ఉంటే 'జగనన్నకు చెబుదాం'లో చెప్పండి

పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలని, ఇంకా ప్రభుత్వ పథకాలకు అర్హత ఉండి అందరని వారికి ఈ జగన్ అన్న సురక్ష కార్యక్రమం ద్వారా లబ్ధి పొందుతారని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్న జగనన్నకు  చెబుదాం ప్రోగ్రాం ద్వారా మీ సమస్య వివరంగా తెలియజేయాలని గ్రామ ప్రజలకు ఎమ్మెల్యే తెలియజేశారు.

- Advertisement -

నేరుగా గ్రామ ప్రజల దగ్గరి నుంచి వచ్చే వినతులు స్వయాన్ని ఎమ్మెల్యే పరిశీలించి వెంటనే పరిష్కారం చేయాలని అధికారులు ఆదేశించారు శిల్పా. కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలకు మంజూరైన పత్రాలు ఎమ్మెల్యే చేతుల మీదుగా  సర్టిఫికెట్లకు సంబంధించిన పత్రాలను ప్రజలకు అందజేశారు. వెలుగోడు మండల సచివాలయం-1లో 564 సర్వీసులు రాగా 553 సర్వీసులను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అంబాల ప్రభాకర్ రెడ్డి, జెసిఎస్ కన్వీనర్ తిరూపం రెడ్డి, ఎంపీపీ లలం రమేష్,గ్రామ సర్పంచ్ వెల్పుల జయపాల్,జేపీటీసీ అమిరున్ బీ ఎంపీటీసీ, జడ్పిటీసీ కో ఆప్షన్ మెంబర్స్ మండల ప్రధాన కార్యదర్శి, రామ్మోహన్ రెడ్డి, ఎం ఇలియాస్ ఖాన్ వెలుగోడు పట్టణ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు ,రైతు సంఘం ప్రెసిడెంట్ రమణ, శంషీర్ అలి , కాటే పోగు రమేష్ ,పులి గోవర్ధన్ రెడ్డి మండల ప్రజా ప్రతినిధులు,మండల వైఎస్ఆర్సిపి నాయకులు, అధికారులు,సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News