Friday, December 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

Chevireddy Bhaskar Reddy: చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోక్సో చట్టం కింద తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానంలో విచారణ జరిగింది. ఈ సందర్భంగా కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. అయితే అప్పటివరకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. దీంతో చెవిరెడ్డి అరెస్టు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

- Advertisement -

కాగా తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిందంటూ చెవిరెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఆయనపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ చెవిరెడ్డి ఇటీవలే హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News