Wednesday, November 13, 2024
Homeఆంధ్రప్రదేశ్Singanamala: నోటికొచ్చిన అడ్డగోలు హామీలిస్తున్న బాబు

Singanamala: నోటికొచ్చిన అడ్డగోలు హామీలిస్తున్న బాబు

రాష్ట్రం శ్రీలంక అని చెప్పి బాబు ఇప్పుడిలా..

జగనన్న మాట ఇచ్చారంటే ఎంత కష్టమొచ్చినా నెరవేర్చి తీరుతారని, అలాంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామని శింగనమల వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.
యల్లనూరు మండలం శింగవరం, ఎస్.కొత్తపల్లి, గొడ్డుమర్రి, చింతకాయమంద, కొడవండ్లపల్లి, ఆరవేడు, బుక్కాపురం గ్రామాలలో ” మన ఊరికి మన వీరా” కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వైఎస్ఆర్ ఎన్నికల ప్రచారాన్ని పార్టీ నాయకులతో కలిసి వీరాంజనేయులు చేపట్టారు.

- Advertisement -


ఇంటింటికి తిరుగుతూ.. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఆయా కుటుంబాలకు జరిగిన సంక్షేమాన్ని వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
వీరాంజనేయులు మాట్లాడుతూ..సంక్షేమ పథకాల తో పాటు అభివృద్ధి కొనసాగాలంటే జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ చంద్రబాబు నాయుడు మోసపూరిత వాగ్దానాలు గుప్పిస్తున్నారని, గతంలో వారు చేసిన మంచిని వివరించి ఓటు అడిగే సత్తా ఆ పార్టీకి లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఎలాగూ గెలవలేనని గ్రహించి నోటికి వచ్చినట్లు అడ్డగోలు హామీలు ఇస్తున్నాడని వాటి ప్రజల నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. నిన్నటిదాకా జగనన్న సంక్షేమం చేస్తుంటే ప్రజలను సోమరిపోతులను చేస్తున్నాడని, రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చెప్పిన ఆ పెద్దమనిషి, ఇప్పుడు అంతకుమించి సంక్షేమం చేస్తాననడం విడ్డూరంగా ఉందని చెప్పారు. జగనన్న చేయగలిగింది చెబుతారు, చెప్పింది తప్పకుండా చేస్తారనే విశ్వాసం ప్రజల్లో ఉందని వివరించారు. ఇలాంటి గొప్ప సంక్షేమం మళ్లీ మనకి కావాలంటే రానున్న ఎన్నికలలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News