Sunday, November 16, 2025
HomeTop StoriesBreaking News: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్

Breaking News: వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌ అరెస్ట్

Jogi Ramesh arrest: నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్‌ అరెస్ట్ అయ్యారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని ఆయన ఇంటికి ఈ ఉదయాన్నే సిట్, ఎక్సైజ్ అధికారులు వెళ్లారు. ఇంటికి చేరుకున్న సిట్, ఎక్సైజ్ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. జోగి రమేశ్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరేపల్లి రామును సైతం అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే నకిలీ మద్యం విక్రయాలు చేసినట్లు ఈ కేసులో ఏ1గా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు వాంగ్మూలం ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జోగి రమేశ్‌ ఇంటికి పోలీసులు వెళ్లి.. అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.

- Advertisement -

జోగి రమేశ్‌ ఆశపెట్టాడు: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్‌ పాత్ర ఉన్నట్లుగా సిట్‌ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జోగి రమేశ్‌ చెప్తేనే నకిలీ మద్యం తయారు చేశానని సిట్ అధికారుల విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. జోగి రమేశ్‌ ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చాడని జనార్ధన్ రావు పోలీసుల ముందు తెలిపినట్టుగా సమాచారం.  తనకు రూ.3 కోట్లు సాయం చేస్తానని రమేశ్‌ హామీ ఇచ్చారని జనార్ధన్ రావు తెలిపారు. ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఇందులోకి దిగానని చెప్పాడు.

ఆరోపణలను ఖండించిన జోగి రమేశ్‌: అయితే జోగి రమేశ్‌ మాత్రం తనకు జనార్ధన్ రావు అనే వ్యక్తి తెలియదని అన్నారు. నకిలీ మద్యం కేసుతోనూ తనకు ఎలాంటి సంబంధం లేదని జోగి రమేశ్‌ అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. జనార్ధన రావును తానెప్పుడూ కలవలేదని తెలిపారు. అయితే జనార్ధనరావుతో జోగి రమేశ్‌ ఉన్న కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బయటకు వచ్చాయి. కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు వాస్తవాలు సిట్ అధికారులకు వెల్లడించడంతో జోగి రమేశ్‌కు ఉచ్చు బిగుసుకుంది. అయితే ఈ కేసులో తనను కావాలని ఇరికిస్తున్నారాని జోగి రమేశ్‌ అన్నారు. కల్తీ మద్యం కేసులో సీబీఐ విచారణ జరుపాలని హైకోర్టులో శనివారం జోగి రమేశ్‌ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad