Sleeper Bus Accidents Reasons : కర్నూలు జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదం అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కవేరి ట్రావెల్స్ వోల్వో స్లీపర్ బస్సు చిన్నటేకూరు వద్ద బైక్‌తో కలిసి మంటల్లో మునిగిపోయింది. 41 మంది ప్రయాణికుల్లో 20 మంది సజీవ దహనమైనారు. మరో 12 మంది గాయపడ్డారు. ఇలాంటి దారుణాలు గత 10 రోజుల్లోనే రెండు. రాజస్థాన్ జైసల్మేర్ వద్ద అక్టోబర్ 14న స్లీపర్ బస్సు మంటల్లో 21 మంది మరణించారు. డోల్పుర్‌లో 19న మరో ప్రమాదంలో 12 మంది కలిగిపోయారు. మరి, స్లీపర్ బస్సుల్లో ఎందుకీ ప్రమాదాలు? డిజైన్ లోపాలే కారణమా?
ALSO READ: Buss fire: కేసులు పెట్టి లోపలేస్తాం: ప్రైవేటు ట్రావెల్స్ యజమానులకు మంత్రి పొన్నం తీవ్ర హెచ్చరికలు!
స్లీపర్ బస్సులు 2×1 సీటింగ్‌తో 30-40 మంది ప్రయాణించేలా రూపొందించబడతాయి. ప్రతి బెర్త్ 6 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పు. కానీ, బెర్థ్‌ల మధ్య గ్యాలరీలు చాలా ఇరుకుగా (కేవలం ఒక వ్యక్తి వెళ్లేలా) ఉంటాయి. ప్రమాద సమయంలో ప్రయాణికులు వేగంగా బయటకు రాలేకపోతారు. బస్సు ఎత్తు 8-9 అడుగులు ఉండటంతో, ఒరిగిపోతే కిటికీలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లకు చేరడం కష్టం. రెస్క్యూ కూడా ఆలస్యమవుతుంది.
రాత్రి ప్రయాణాలకు ఎక్కువగా వాడతారు కాబట్టి, డ్రైవర్ అలసట, మగత ముప్పు ఎక్కువ. 2018 సర్వే ప్రకారం, 25% డ్రైవర్లు అర్ధరాత్రి తర్వాత నిద్రపోతారు. అధునాతన డ్రౌజీనెస్ అలర్ట్ సిస్టమ్‌లు ఉన్నా, పనితీరు పరిమితం. అనధికృత మార్పులు (ఎక్స్‌ట్రా వైరింగ్, AC) మంటల మూలం.
మొదటి 2 నిమిషాలు కీలకం. నిద్రలో ఉన్నవారు తేరుకోకముందే మంటలు వ్యాపిస్తాయి. అప్పర్ బెర్థ్‌లో ఉన్నవారు ఎక్కువగా చిక్కుకుంటారు. భారత్‌లో 2023లో 1.72 లక్షల రోడ్డు మరణాల్లో బస్సు ప్రమాదాలే ఎక్కువ చైనాలో 2009-12 మధ్య 13 ప్రమాదాల్లో 252 మరణాల తర్వాత 2012లో స్లీపర్ బస్సులను నిషేధించారు. భారత్‌లో కూడా కఠిన నిబంధనలు, రెగ్యులర్ ఇన్స్పెక్షన్లు అవసరం. ప్రయాణికులు భద్రతా సామగ్రి (ఫైర్ ఎక్స్‌టింగ్విషర్‌లు, ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు) చెక్ చేసుకోవాలి. ఈ ప్రమాదాలు రవాణా వ్యవస్థలో మార్పుల అవసరాన్ని తలపిస్తున్నాయి.


