Smart Ration Cards : ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎన్టీఆర్ జిల్లాలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి కూటమి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఏటీఎం కార్డుల లాంటి ఈ కార్డులు క్యూఆర్ కోడ్‌తో, లబ్ధిదారి చిత్రం, కుటుంబ సభ్యుల పేర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నంతో కూడిన ఈ కార్డులు సెప్టెంబర్ 15 నుంచి పంపిణీకి సిద్ధమవుతున్నాయి. మొదట ఈ నెల 25వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా కొన్ని జిల్లాల్లో ప్రారంభించినా, పూర్తి స్థాయిలో సెప్టెంబర్‌లో అమలవుతాయి. జిల్లా మెత్తం 5.79 లక్షల రేషన్ కార్డుల యజమానులకు ఈ కార్డులు అందనున్నాయి.
ALSO READ: Khammam: దెయ్యం పట్టిందని.. భర్తను ఫుల్లుగా కుమ్మేసిన భార్య..అసలు ట్విస్ట్ ఏంటంటే..
పాత కార్డులకు బదులు ఈ స్మార్ట్ కార్డులు ఆధునిక సౌలభ్యాలను అందిస్తాయి. వైసీపీ పాలనలో పేరు మార్పులు, కార్డు విభజనకు ఎదురైన ఆంక్షలు, ఇబ్బందులు ఇప్పుడు తొలగనున్నాయి. కొత్త కార్డుల కోసం 6,413, విభజన కోసం 9,227, చిరునామా మార్పు కోసం 1,658, అదనపు సభ్యుల పేర్లు నమోదు కోసం 56,322 దరఖాస్తులు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రజల కష్టాలను పరిష్కరించేందుకు ప్రత్యేక జీవోతో ముందుకు సాగుతోంది.
ఈ కార్డులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సులభం చేస్తాయి. రేషన్ షాపుల్లో సరకులు తీసుకోవడం ఇప్పుడు త్వరగా, సౌకర్యవంతంగా అవుతుంది. జిల్లా యంత్రాంగం పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.


