Homeఆంధ్రప్రదేశ్Bethamcherla : బేతంచెర్ల మోడల్ స్కూల్‌లో పాము కలకలం.. పరుగులు తీసిన విద్యార్థులు

Bethamcherla : బేతంచెర్ల మోడల్ స్కూల్‌లో పాము కలకలం.. పరుగులు తీసిన విద్యార్థులు

బేతంచెర్ల(తెలుగు ప్రభ): గోరుమానుకొండ గ్రామ సమీపాన ఏపీ మోడల్ స్కూల్ లో పాము కనిపించడంతో ఆదివారం కలకలం రేగింది. ఉదయం ఆరడుగుల జెర్రిపోతు పాము పాఠశాలలోకి దూరింది. దీంతో విద్యార్థినులు భయంతో పరుగులు తీశారు.

- Advertisement -

విషయం తెలుసుకున్న పాఠశాల సిబ్బంది బేతంచెర్లకు చెందిన స్నేక్ క్యాచర్ మహబూబ్ హుస్సేన్ కు సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న ఆయన విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పామును పట్టుకున్నారు. అనంతరం పామును పాఠశాలకు దూరంగా కొండ శివార్లలో వదిలిపెడతామని తెలిపారు. పామును పట్టుకోవడంతో విద్యార్థినులు భయం వీడి ఊపిరి పీల్చుకున్నారు

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News