Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్AP Scams: కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన చిట్టీల వ్యాపారి..రాత్రికి రాత్రే జంప్

AP Scams: కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన చిట్టీల వ్యాపారి..రాత్రికి రాత్రే జంప్

AP Fake Investments: కోఆపరేటివ్ సొసైటీ పేరుతో డిపాజిట్లు తీసుకొని..చెల్లించే సమయానికి బోర్డు తిప్పేసిన ఘటన విశాఖపట్నంలో జరిగింది. రాజ్యాంగ కర్త డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ ఆశయ సాధన పేరుతో కోఆపరేటివ్‌ సొసైటీ స్థాపించి వందల మంది దగ్గర డిపాజిట్లు తీసుకున్నారు. ఆ వెంటనే బోర్డు తిప్పేయడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

- Advertisement -

ఐఆర్‌ఎస్‌ మాజీ అధికారి కటికల శివభాగ్యారావు 2008లో స్నేహ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీని స్థాపించారు. దీన్ని స్నేహా మ్యాక్స్ అని కూడా అంటారు. ఇచ్చిన డబ్బుకి 12 శాతం వడ్డీ ఇస్తామని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులు సహా పలువురిని నమ్మించి డిపాజిట్లు సేకరించారు. విశాఖ పరిసర ప్రాంతాల్లోనే సుమారు 2,500 మంది నుంచి రూ.100 కోట్లు డిపాజిట్లుగా రాబట్టారు. ప్రారంభ రోజుల్లో వడ్డీ సక్రమంగా చెల్లించి.. ఆ తర్వాత మెల్లగా కార్యకలాపాలు తగ్గించుకుంటూ వచ్చారు. దీంతో ప్రజలకు అనుమానం కలిగింది. వారు చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ డిపాజిటర్లు
డిమాండ్‌ చేసినా ఫలితం లేదు. దీంతో మోసపోయామని గమనించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

నిబంధనలకు విరుద్ధంగా సొంత ఆస్తులు పెంచుకున్నారు ఆ సంస్థలోని డైరెక్టర్లు, సిబ్బంది కలిసి ఖాతాదారులను మోసం చేశారని కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వీరిలో కొందరు దువ్వాడ, ద్వారకానగర్‌ పోలీసులకు ఆశ్రయించారు.

కేసు నమోదు చేసి వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సంస్థ ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాసరావు, డైరెక్టర్లు గూడూరు సీతామహాలక్ష్మి, ఎల్‌.విశ్వేశ్వరరావు, ఉండవల్లి శ్రీనివాసరావు, ఎకౌంటెంట్‌ ధనలక్ష్మిల సహా మేనేజర్‌ రంగారావును అరెస్టు చేశారు. ఈ సొసైటీ ఛైర్మన్‌ శివభాగ్యారావు పరారీలో ఉండగా.. మరో 12 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని జిల్లా కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్‌ విధించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad