Homeఆంధ్రప్రదేశ్Secunderabad: గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్.. దీని ప్రత్యేకతలివే..!

Secunderabad: గుడ్‌న్యూస్‌.. సికింద్రాబాద్-అనకాపల్లి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్.. దీని ప్రత్యేకతలివే..!

South Central Railway New Rail From Secunderabad to Anakapalli: సికింద్రాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌ చెప్పింది. సికింద్రాబాద్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లికి మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు స్టేషన్ల మధ్య కొత్తగా వీక్లీ ఎక్స్‌ను ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లను రెండు స్టేషన్ల మధ్య నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే.. ఇప్పుడు మరో కొత్త రైలును ప్రవేశపెడుతోంది. దీనికి సంబంధించిన షెడ్యూల్, హాల్ట్‌లు, ఇతర వివరాలు ఇలా ఉన్నాయి.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/national-news/a-new-equation-on-the-screen-of-tamilnadu/

ఈ నెల 24 నుంచి అందుబాటులోకి..

ఈ నెల 24 నుంచి ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ నుంచి అనకాపల్లికి ప్రతి ఆదివారం నడిచేలా కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నెం.17043 అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్‌లో ఆదివారం రాత్రి 9కి బయలుదేరే రైలు అనకాపల్లికి సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటుంది. అనకాపల్లి నుంచి సికింద్రాబాద్‌కు ప్రతి సోమవారం నడిచేలా మరో కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నెం.17044 ఈ నెల 18 నుంచి అందుబాటులోకి వస్తోంది. అనకాపల్లిలో సోమవారం సాయంత్రం 5:35కు బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలు మంగళవారం ఉదయం 8.40 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది.

ఏ ఏ స్టేషన్‌ల్లో ఆగుతుందంటే?

రెండు రైళ్లకు చర్లపల్లి, నల్లగొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, యలమంచిలిలి రైల్వే స్టేషన్‌ల్లో స్టాప్‌లు ఇచ్చారు. రెండు రైళ్లలో ఒక ఫస్ట్ ఏసీ, నాలుగు సెకండ్ ఏసీ, 12 ధర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. ఆదివారంతో పాటు రద్దీ ఎక్కువగా ఉండే రోజుల్లో నడిచేలా రైళ్ల షెడ్యూల్ ప్లాన్ చేశారు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఎక్కువగా స్టాప్‌లు ఇచ్చారు. దీంతో అనకాపల్లితో పాటు గోదావరి జిల్లాల ప్రయాణికులకు రైళ్లు ఎక్కువగా ఉపయోగపడనున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News