SouthindiaShopping Mall-Nidhi Agarwal: శ్రీకాకుళం నగరం ఇప్పుడు మరింత మోడరన్ టచ్ అందుకున్నట్టు చెప్పాలి. ఆగస్టు 2న జీటీ రోడ్‌లో కొత్తగా తెరుచుకున్న సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ బ్రాంచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. సంప్రదాయం, ఆధునికత కలిసిన వైవిధ్యభరిత కలెక్షన్లు, మెరుగైన షాపింగ్ అనుభవం కలిపి ఈ షోరూమ్‌ను మరింత ప్రత్యేకంగా మార్చేశాయి. సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ ముఖ్య అతిథిగా ఈ వేడుకకు హాజరై శోభాయమానంగా మాల్ ని ప్రారంభించారు.
శ్రావణమాసం సమయంలో ప్రారంభించిన ఈ షాపింగ్‌మాల్ ప్రస్తుతం సందడిగా మారింది. కుటుంబ వేడుకల కోసం, వరలక్ష్మీ పూజల సందర్భానికి కావాల్సిన ప్రత్యేక వస్త్రాలు ఇక్కడ విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. చిన్నవారి నుంచి పెద్దల వరకూ అందరికీ సూటయ్యేలా కళాత్మకమైన డిజైన్లు, ఉత్తమ నాణ్యత గల ఫ్యాబ్రిక్స్‌తో రూపొందించిన కలెక్షన్లు ఈ షోరూమ్ హైలైట్‌గా నిలుస్తున్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు సురేశ్ శీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్ తదితరులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, శ్రీకాకుళం ప్రజలకు ఉత్తమమైన షాపింగ్ ప్లాట్‌ఫామ్‌ను అందించాలనే లక్ష్యంతో ఈ షోరూమ్‌ను ఎంతో శ్రద్ధగా అభివృద్ధి చేశామని తెలిపారు. స్థానిక వస్త్రాభిమానుల అభిరుచులకు అనుగుణంగా అత్యంత విలువైన కస్టమర్ కి మంచి ఎక్స్‌పీరియన్స్‌ను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నట్టు చెప్పారు.
ఎంతో గర్వకారణం..
డైరెక్టర్ సురేశ్ మాట్లాడుతూ, ఈ బ్రాంచ్‌ను ప్రారంభించడం ఎంతో గర్వకారణమన్నారు. శ్రీకాకుళం ప్రజల అభిరుచులకు తగ్గట్టుగా ప్రీమియం వేర్ నుంచి డైలీ వేర్ దాకా అన్ని రకాల వస్త్రాల శ్రేణి ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉందన్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో కొత్తదనం కోరుకునే వారికి ఇది ఉత్తమ గమ్యస్థానంగా నిలుస్తుందని చెప్పారు.
స్పెషల్‌గా ఫోకస్..
డైరెక్టర్ అభినయ్ మాట్లాడుతూ, రాబోయే పండుగలు, పెళ్లిళ్లకు కావాల్సిన సంప్రదాయ వస్త్రాల కలెక్షన్‌పై తమ షోరూమ్ స్పెషల్‌గా ఫోకస్ పెట్టిందని తెలిపారు. ఒక్కసారి చూసినవారిని ఆకట్టుకునే విధంగా బ్రైడల్ వేర్, ఎత్నిక్ వేర్, ఫ్యామిలీ కలెక్షన్లను తీసుకువచ్చినట్టు వివరించారు.
డైరెక్టర్ రాకేశ్ మాట్లాడుతూ, శ్రీకాకుళం ప్రాంతంలో ఇది ఇప్పటివరకు ఉన్న షాపింగ్ మాల్స్‌లోనే అతిపెద్దదని తెలిపారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే ధరల్లో ఉండటమే తమ ప్రత్యేకత అన్నారు. నాణ్యతలోనూ ధరల పరంగానూ కస్టమర్లను సంతృప్తిపర్చడమే తమ లక్ష్యమని చెప్పారు.
స్పెషల్ కలెక్షన్లతో..
డైరెక్టర్ కేశవ్ మాట్లాడుతూ, తమకు లభిస్తున్న ప్రజాదరణ ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ప్రతి వినియోగదారుని అర్థం చేసుకుని వారు కోరుకునే డిజైన్లను అందించేందుకు సంస్థ సిద్ధంగా ఉందన్నారు. త్వరలో మరిన్ని స్పెషల్ కలెక్షన్లతో ఈ బ్రాంచ్ మరింత ప్రత్యేకంగా మారుతుందని ధీమా వ్యక్తం చేశారు.
బడ్జెట్ ప్రియుల నుంచి..
పెళ్లిసీజన్‌లో ప్రత్యేకంగా డిజైన్ చేసిన పట్టు చీరలు, మగ్గాలపై తయారైన డిజైన్లు, పెళ్లిళ్ల కోసం సిద్ధం చేసిన గౌన్లు, జాకెట్ లేహంగాలు, అలాగే అతిథుల కోసం ఉండే ఫ్యాన్సీ డ్రెస్‌లు మరెన్నో ఆకట్టుకుంటున్నాయి. బడ్జెట్ ప్రియుల నుంచి హైఎండ్ లుక్స్ కోరుకునేవారివరకు ప్రతి ఒక్కరి కోసం విస్తృత శ్రేణి కలెక్షన్లు సిద్ధంగా ఉన్నాయి.
వస్త్రాల పరంగా పెట్టుబడి అనిపించేలా ఉండే కంచి పట్టు చీరలు, సిల్క్ శారీస్, జార్జెట్, క్రేప్, లీనెన్, కాటన్ వేర్‌ల వంటి ఎన్నో రకాల ఫాబ్రిక్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రెండీ లుక్స్ కోసం యువతకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఇండో వెస్ట్రన్ అవుట్‌ఫిట్స్, ఫ్యాషన్ సూట్స్ యువతను ఆకట్టుకుంటున్నాయి.
ఈ షోరూమ్‌ను సందర్శించిన వారు అంతా తమ అభిప్రాయాలను పంచుకుంటూ, ఈ కొత్త బ్రాంచ్ ద్వారా శ్రీకాకుళంలో నాణ్యతకు మరో పేరు ఏర్పడిందని పేర్కొన్నారు. సౌత్ ఇండియా షాపింగ్‌మాల్ తన విస్తరణను కొనసాగిస్తూ, రీటెయిల్ రంగంలో తనదైన స్థానం ఏర్పరుస్తోందని కొనియాడారు.


