ఏపీలో నేరాలను తగ్గించడానికి అధునాతన టెక్నాలజీని వాడుకోవాలని పోలీసులకు సీఎం చంద్రబాబు (CM Chandrababu)సూచించారు. నేరాలు అదుపులో లేకుంటే ప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నించే పరిస్థితి వస్తుందని అన్నారు. ఆన్లైన్ బెట్టింగ్ను ఆపేందుకు ప్రత్యేక చట్టం తీసుకొస్తామని తెలిపారు. ‘నేరస్థులు తెలివిగా సాక్ష్యాలను మాయం చేస్తారు. వైఎస్ వివేకా హత్య కేసు దీనికి ఉదాహరణ. అందుకే ఫోరెన్సిక్ ఎవిడెన్స్ సేకరణలో జాగ్రత్తగా ఉండాలి’ అని సూచించారు.
జపాన్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
“ఈరోజు అమరావతిలో జపాన్ రాయబారి కెయిచి ఓనో నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యాం. ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడం, ఆంధ్రప్రదేశ్లో జపాన్ పెట్టుబడులను విస్తరించడంపై చర్చలు జరిగాయి. నౌకానిర్మాణం, ఎలక్ట్రానిక్స్, రసాయనాలు, ఆటోమొబైల్స్, విద్య వంటి వివిధ రంగాలలో సహకారాన్ని అన్వేషించడంపై మా చర్చలు కొనసాగాయి” అని ట్వీట్ చేశారు.
