Wednesday, March 19, 2025
Homeఆంధ్రప్రదేశ్Sports: శాసనసభ్యుల క్రీడా పోటీల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో విజయకేతనం

Sports: శాసనసభ్యుల క్రీడా పోటీల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో విజయకేతనం

శాసనసభ్యులకు నిర్వహించిన ప్రత్యేక క్రీడా పోటీల్లో(Sports competitions for legislators) భాగంగా స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు వాలీబాల్ పోటీలో పాల్గొన్నారు. ఈ మ్యాచ్‌లో స్పీకర్ కెప్టెన్‌గా ఉన్న “స్పీకర్ టీం” 25 పాయింట్లు సాధించి విజయం సాధించింది. హోం మినిస్టర్ టీం 20 పాయింట్లతో నిలిచింది.

- Advertisement -

గౌరవ స్పీకర్ అయ్యన్నపాత్రుడు యువకుల తరహాలో మైదానంలో చురుకుగా కదలాడి, ప్రత్యర్థి జట్టుపై ఆధిక్యత చూపించారు. వాలీబాల్ ప్లేయర్‌గా గతంలో మంచి అనుభవం కలిగిన స్పీకర్ , అదే నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ తన జట్టుకు గెలుపును అందించారు.

ఈ క్రీడా పోటీలు శాసనసభ సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పడానికి, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు. పోటీలు ఉత్సాహంగా సాగిన ఈ సందర్భంగా, గెలుపొందిన స్పీకర్ టీం సభ్యులకు అభినందనలు వెల్లువెత్తాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News