Homeఆంధ్రప్రదేశ్Sri City Boiler Blast: శ్రీసిటీలో బాయిలర్ పేలి నలుగురి మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

Sri City Boiler Blast: శ్రీసిటీలో బాయిలర్ పేలి నలుగురి మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

తిరుపతి జిల్లా: సత్యవేడు మండలంలోని శ్రీసిటీ పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న పలువురు కార్మికులు పేలుడు ఘటనలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రాణనష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఘటనపై సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు.

- Advertisement -

ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

శ్రీసిటీలోని ప్రైవేట్ పరిశ్రమలో బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాయిలర్ పేలిన సమయంలో ఘటనా స్థలంలోనే ఇద్దరు మృతి చెందారని, మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని అధికారులు సీఎంకు వివరించారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

 

నారా లోకేశ్ సంతాపం

శ్రీసిటీలోని ప్రైవేటు ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బాయిలర్ పేలి కార్మికులు మృతి చెందడం, మరికొందరు గాయపడటం తీరని విషాదమన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. తమ వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను కోరారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని నారా లోకేశ్ తెలిపారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News