Sri Reddy| ఏపీలో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితపై అసభ్యకర పోస్టులు పెట్టిన నటి శ్రీరెడ్డిపై అనకాపల్లితో పాటు రాజమండ్రిలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అరెస్ట్ తప్పదనే ప్రచారం మొదలైంది. దాంతో తనను వదిలేయండంటూ శ్రీరెడ్డి ప్రభుత్వ పెద్దలను వేడుకుంటూ వీడియో విడుదల చేసింది. తాజాగా మంత్రి నారా లోకేష్‌కు బహిరంగ లేఖ రాసింది.
తెలుగు అమ్మాయినైన తనను క్షమించి వదిలేయాలని.. తెలియక తప్పు చేశానంటూ క్షమాపణలు చెప్పారు. ప్లీజ్ లోకేశ్ అన్నా.. తనను అరెస్టు చేయవద్దంటూ వేడుకుంది. తనపై నమోదైన కేసుల నుంచి తనను రక్షించాలని ప్రాథేయపడింది. లోకేష్ అన్నా ఇంకా ఎవరికైనా సారీ చెప్పటం మరిచిపోతే, వారికి కూడా పేరు పేరునా క్షమాపణలు అడుగుతున్నాను అని పేర్కొంది. అలాగే మూవీ ఫీల్డ్‌లో ఉన్న చిరంజీవి, నాగబాబు గారికి అందరికీ కూడా క్షమాపణలు.. షర్మిలక్క, సునీతక్క మీరు కూడా క్షమించండి అని లేఖలో పేర్కొన్నారు.
అలాగే వైసీపీ అధినేత జగన్‌కు, భారతికి కూడా శ్రీరెడ్డి లేఖ రాశారు. వైసీపీకి చెడ్డ పేరు తీసుకొచ్చానని వాపోయారు. సాక్షిలో పని చేసినప్పటి నుంచి ఇద్దరిపై గౌరవ మర్యాదలు ఏర్పడ్డాయని.. ఇప్పుడు తన వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చిందన్నారు. ఇకపై పార్టీకి, పార్టీ కార్యకర్తలకి దూరంగా ఉండాలనుకుంటున్నానని.. జగనన్న క్షమించండి అని వేడుకుంది.