ఏపీ రాజధాని అమరావతి(Amaravati)లోని వెంకటపాలెంలో శ్రీవేంకటేశ్వర కల్యాణ మహోత్సవం కన్నులపండువగా కొనసాగుతోంది. ఆలయ ప్రాంగణం వద్ద తిరుమల ఆలయ నమూనా గోపురాలతో విశాలమైన వేదిక ఏర్పాటు చేశారు. విద్యుత్తు దీపాలు, పుష్పాలు, పచ్చటి తోరణాలు, దశావతారాల కటౌట్లతో ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో అమరావతి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
- Advertisement -
ఈ కల్యాణ మహోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు(Chandrababu), న్యాయమూర్తులు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, టీటీడీ బోర్డు సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామి వారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు.
