Sunday, October 6, 2024
Homeఆంధ్రప్రదేశ్Srichaitanya project: నేషనల్ స్పేస్ సొసైటీ యన్ యస్ యస్ ప్రయోగానికి శ్రీ చైతన్య...

Srichaitanya project: నేషనల్ స్పేస్ సొసైటీ యన్ యస్ యస్ ప్రయోగానికి శ్రీ చైతన్య ప్రాజెక్టు ఎంపిక

విద్యార్థులకు వెల్లువెత్తిన అభినందనలు

పత్తికొండ స్థానిక యశోద గార్డెన్ లో ఉన్న శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థులు నాసా ప్రాజెక్టు ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారి అథేరా కృష్ణన్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతిష్టాత్మకంగా నాసా ప్రతి సంవత్సరం నేషనల్ స్పేస్ సొసైటీ అంతరిక్ష పరిశోధనలను ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా తమ పాఠశాల విద్యార్థులు స్పేస్ కాలనీ , స్పేస్ హోటల్, ఆస్టెరాయిడ్ మైనింగ్ అనే అంశాలపై తమ ప్రాజెక్టులను పంపగా అందులో విక్రమ్ సారాభాయ్ టీం వారి స్పేస్ హోటల్ అనే ప్రాజెక్టు ఎంపికయింది. తమ పాఠశాల విద్యార్థులు ఈ విధంగా ఎంపిక కావడం వల్ల పాఠశాల ఏ. జి యం సురేష్ , ఆర్. ఐ రంగారెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మరెన్నో ప్రాజెక్టులను భవిష్యత్తు కాలంలో ఎంపిక కావాలని కోరుకుంటున్నాను. పాఠశాల కో ఆర్డినేటర్ రమణ మాట్లాడుతూ సాధారణ విద్యతో పాటు పరిశోధన పరమైన సాంకేతిక విద్యను అందించడంలో తమ పాఠశాల కరికులం ఎంతో ఉపయోగ పడుతుంది అని తెలిపారు.పాఠశాల అకాడమిక్ డీన్ సుధాకర్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ఎంపిక కావడం పట్ల తమ పాఠశాల విద్యార్థులు , ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిదని తెలిపారు . ఈ సభలో పాఠశాల బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. నేషనల్ స్పేస్ సొసైటీ యన్ యస్ యస్ ప్రయోగానికి శ్రీ చైతన్య ఉపాధ్యాయుల కృషి వెలకట్ట లేనిదని తెలిపారు .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News