ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్ హార్బర్‌కు, గొట్టా బ్యారేజ్ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు రూ.176.35 కోట్లతో వంశధార లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు, రూ.852 కోట్ల వ్యయంతో మహేంద్ర తనయ ప్రాజెక్టు ఆఫ్ షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు పనులకు కూడా శంకుస్ధాపన చేసిన ముఖ్యమంత్రి.
కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్, రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో జగన్ ఈ కింది విధంగా సభకు హాజరైనవారికి విజ్ఞప్తి చేస్తూ, ప్రతిపక్షానికి గట్టి హెచ్చరిక జారీచేశారు.
నా ధైర్యం మీరే– నా నమ్మకం మీరే…
ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు. ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు. ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ బిడ్డ నమ్ముకున్నది ఒక్క దేవుడి దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మాత్రమే.
తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి….
తోడేళ్లన్నీ ఏకమవుతున్నాయి. కానీ మీ బిడ్డకు భయం లేదు. మీ అందరికీ నేను ఒక్కటే కోరుతున్నాను. ఈ అబద్దాలను నమ్మకండి. వీళ్ల మాదిరిగా అబద్ధాలు చెప్పే అలవాటు మీ బిడ్డకు లేదు. మిమ్నల్ని ఒక్కటే కోరుతున్నాను. మీ ఇంట్లో మంచి జరిగిందా ? లేదా ? అన్నది ఒక్కటే కొలమానంగా తీసుకొండి.
మీకు జరిగిన మంచే కొలమానం….
మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా నిలబడండి. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి.
మీ బిడ్డకు వీళ్ల మాదిరిగా ఇన్నిన్ని మీడియా ఛానెళ్లు, ఇంతింతమంది నాయకులు, చెడిపోయిన రాజకీయ సామ్రాజ్యం, ఒక దత్తపుత్రుడు వీళ్లంతా కూడా తోడుగా లేరు.
మీ బిడ్డ ఆధారపడేది ఆ దేవుడి దయ, మీ చల్లని ఆశీస్సులు మీద మాత్రమే. ఇవాళ శ్రీకాకుళంలో జరుగుతున్న ఈ మంచి వల్ల ఈ ప్రాంతమంతా బాగుపడాలి, ఈ ప్రాంతానికి ఇంకా మంచి చేసే పరిస్థితి, దేవుడి చల్లని దీవెనలు మీ బిడ్డకు ఈ ప్రభుత్వానికి ఎప్పుడూ ఉండాలి.