Saturday, February 15, 2025
Homeఆంధ్రప్రదేశ్Srilila lanches The Chennai Shopping Mall in Vijayawada: విజయవాడలో చెన్నై షాపింగ్...

Srilila lanches The Chennai Shopping Mall in Vijayawada: విజయవాడలో చెన్నై షాపింగ్ మాల్ ప్రారంభించిన శ్రీలీల

చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకతే వేరు..

వస్త్ర ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చెన్నై షాపింగ్ మాల్ నూతన షోరూమ్ విజయవాడ బందర్ రోడ్‌లో ప్రముఖ హీరోయిన్ శ్రీలీల చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభమైంది. చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకమైన అధునాతన కలెక్షన్‌తో ఆకట్టుకుంటుందని, ప్రతి ఒక్కరు సందర్శించాలని ఆమె ఆకాంక్షించారు.

- Advertisement -

మా అమ్మకి పట్టుచీరలంటే ఇష్టం అందేకే నేను కూడా..

ముందుగా మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావులు నూతన షోరూమ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా నటి శ్రీలీల మాట్లాడుతూ చెన్నై షాపింగ్ మాల్ తన చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. విజయవాడలో చాలా షో రూమ్‌లు ప్రారంభించాననీ చెప్పారు. కానీ చెన్నై షాపింగ్ మాల్ ప్రత్యేకతే వేరనీ, వీరి వద్ద శారీస్ కలెక్షన్స్ చాలా బాగుందన్నారు. మా అమ్మకి పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని. అందుకే తాను కూడా పట్టు చీరలు కట్టుకుంటానని చెప్పారు.

19 వ మాల్..
లైట్ వెయిట్ ఉన్న పట్టు చీరలు అంటే చాలా ఇష్టమని, సందర్భానుసారంగా డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుందన్నారు. రవితేజతో తన కొత్త సినిమా ప్రారంభం కానుందనీ, తమిళం కన్నడ భాషల్లో కూడా నటించనున్నాను అన్నారు. అనంతరం చెన్నై షాపింగ్ మాల్ అధినేతలు జనార్దన్ రెడ్డి, జమునలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 19 షాపింగ్ మాల్ ప్రారంభించామని, కస్టమర్ టేస్ట్ కు అనుగుణంగా వస్త్రాలను దగ్గరుండి నేయిస్తున్నామన్నారు.

99 రూపాయల నుంచి 3 లక్షల రూపాయల వరకు..

99 రూపాయల నుంచి మూడు లక్షల రూపాయల వరకు చెన్నై షాపింగ్ మాల్ లో ప్రతి ఒక్కరు షాపింగ్ చేసే విధంగా రేట్లు అందుబాటులో ఉంటాయన్నారు. చేనేత కార్మికులకు మా ద్వారా పనికూడ కల్పిస్తున్నామని, కంచి, ధర్మవరం, బెనారస్, ఉప్పాడ, వివిధ రకాలైన పట్టు వస్త్రాలు అన్ని సరసమైన ధరల్లో లభిస్తాయన్నారు. ప్రతి ఒక్కరు చెన్నై షాపింగ్ మాల్ ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News