Tuesday, September 17, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: సాగు నీరు లేక పగుళ్లు బారిన వరి పంటలు

Srisailam: సాగు నీరు లేక పగుళ్లు బారిన వరి పంటలు

శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు గత కొన్ని రోజుల క్రితం సంతజూటూరు గ్రామానికి చెందిన రైతులు సాగు నీరు లేక పంటలు ఎండి పోతున్నాయి అని గ్రామస్తులతో కలిసి నాయకులు కె .శివశంకర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకు పోగా ఎమ్మెల్యే శిల్పా ఎండకారు పంటకు ఈనెల 20 తేదీ వరకు సాగు నీరు ఇస్తాము అని తెలిపిన విషయం తెలిసిందే. రైతులు మాత్రం 20 వ తేదీ వరకు నీరు వస్తే సరిపోవు అని ఆందోళన వ్యక్తపరచగా రైతు పక్షపాతి అయిన ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆదేశాల మేరకు శ్రీశైలం నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా భువనేశ్వర రెడ్డి తెలుగు గంగ DE. వెంకటేశ్వర్లు, అధికారులు, నాయకులతో కలసి రామాపురం, లింగాపురం, సంతజూటూరు గ్రామాల్లో పర్యటించి పొలాలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వీరి వెంట వైఎస్సార్సీపీ మండల నాయకులు ఎంపీపీ దేరెడ్డి చిన్న సంజీవ రెడ్డి, మాజీ ఎంపీపీ దేసు.వెంకటరామిరెడ్డి JCS మండల కన్వీనర్ ముడిమెల పుల్లారెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News