శ్రీశైలమహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని భక్తులకు అత్యంత సౌకర్యవంతంగా ఉండేందుకు బయలు వీరభద్రస్వామి ఆలయం నుండి పాతాళగంగ రోడ్డు వరకు ఎటువంటి తాత్కాలిక దుఖాణాలు (చిరువ్యాపారులు) ఉండరాదని దేవస్థానం అధికారులు చర్యలు చేపట్టినట్లు పదే పదే చెప్తున్నారు. కానీ క్షేత్రపరిధిలో చిరువ్యాపారులు, యాచకులతో భక్తుల రాకపోకలకు పూర్తి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గంగా, గౌరీ సదన్ ముందు భాగం నుండి నంది మండపం వరకు నంది మండపం నుండి కళ్యాణకట్ట వరకు ఆర్టీసీ బస్టాండ్ రహదారుల్లో చిరువ్యాపారులు రహదారులను ఆక్రమించారు. దేవస్థానం అధికారులు చర్యలు తీసుకొని ఇబ్బందులు తొలగించాలని భక్తులు కోరుతున్నారు. స్వామి అమ్మవార్లను దర్శించుకొని బయటకు వచ్చే భక్తులు అమ్మవారి ఆలయం వెనుక భాగంలో యాచకులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Srisailam: యాచకులతో ఇబ్బందులు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES