శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి . నేటి నుండి ఈనెల 21 వరకు 11 రోజులపాటు జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా యాగశాల ప్రవేశం చేశారు. గణపతి పూజ, శివ సంకల్పం, చండీశ్వరపూజ, కంకణాధారణ, అఖండ దీపారాధన, వాస్తు పూజ, వాస్తు హోమం వివిధ విశేష పూజలు నిర్వహించి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా శ్రీకారం చుట్టారు. ఇప్పటికే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు 13 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మ వారి దర్శిస్తారని అంచనా వేసినట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. నిరంతరం నాలుగు క్యూలైన్ల ద్వారా భక్తుల స్వామి అమ్మ వాళ్ళని దర్శించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని.. నేటి నుండి 15వ తేదీ వరకు ఇరుముడి కలిగిన శివ స్వాములను మాత్రమే స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతించనున్నట్టు తెలిపారు.
Srisailam: వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES