Thursday, April 10, 2025
Homeఆంధ్రప్రదేశ్Srisailam Dam: మరోసారి శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల

Srisailam Dam: మరోసారి శ్రీశైలం డ్యాం నుంచి నీటి విడుదల

5వ సారి గేట్లు ఎత్తారు

అల్పపీడన ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మరలా పెరిగింది. దీంతో డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు చేరుతుండటంతో శుక్రవారం మధ్యాహ్నం జలాశయం ఒక్క గేటు ద్వారా జలవనరుల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీరామదాస్ మోహన్ గేట్ల స్విచ్ ఆన్ చేసి నీటి విడుదలను ప్రారంభించారు. ఈ ఏడాది డ్యామ్ గేట్లను ఎత్తడం ఇది ఐదోసారిగా అధికారులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News