శ్రీశైలం సమీపంలోని ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవులు, పైగా ఈరోజు మల్లికార్జున స్వామి అరుద్రోత్సవం కావడంతో శ్రీభ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వేల సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి తరలివచ్చారు. దీనితో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో వాహనాలు కూడా అధిక సంఖ్యలో క్షేత్రానికి వస్తున్నాయి. వాహనాలు ఎక్కువవడంతో భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ముఖద్వారం నుండి శ్రీశైలానికి అలానే శ్రీశైలం నుండి తిరిగి వెళ్లేటప్పుడు శ్రీశైలం టోల్ గేట్ నుండి సాక్షి గణపతి వరకు దాదాపు మూడు కిలోమీటర్ల మేర గంటల సేపు ట్రాఫిక్ జామ్ అవడంతో భక్తుల ఇబ్బందుల గురయ్యారు. సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో విషయం తెలుసుకొని స్పందించిన దేవస్థానం అధికారులు పోలీసులు ట్రాఫిక్ నియంత్రించేందుకు దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది, స్థానిక పోలీసులు రంగంలోకి దిగి వాహనాలను క్లియర్ చేయాల్సివచ్చింది.
Srisailam: శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్
శ్రీశైలం ఘాట్ రోడ్ లో గంటలతరబడి ట్రాఫిక్ జామ్
సంబంధిత వార్తలు | RELATED ARTICLES