రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి చొరవతో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సౌజన్యంతో ఆత్మకూరులో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. శ్రీశైలం నియోజకవర్గంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలన్న సంకల్పంతో ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి, పాంప్లెట్లు, మీడియా ద్వారా భారీ పబ్లిసిటీ ఇవ్వడమే కాకుండా, అభ్యర్థులకు భోజనాలు, రవాణా సౌకర్యం కూడా కల్పించారు. ఎమ్మెల్యే శిల్పా కృషి ఫలించి 15 కంపెనీలు పాల్గొంటే 1071 మంది ఉద్యోగార్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మొత్తం 515 మందికి ఉద్యోగాలు రావడంతో మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు విరబూశాయి. మిగిలిన వారికి సెకండ్ రౌండ్స్ లో కొన్ని కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది. షార్ట్ లిస్ట్ లో 350 మంది దాకా ఉన్నారు. వచ్చే వారంలో వాళ్లకు కంపెనీలు ఆఫర్ లెటర్స్ జారీ చేస్తాయి.
Srisailam: మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్
మొత్తం 515 మందికి ఉద్యోగాలు రావడంతో మధ్య తరగతి కుటుంబాల్లో వెలుగులు విరబూశాయి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES