దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా నియమితులైన డి.పెద్దిరాజు పరిపాలనా భవనములో అధికారిక బాధ్యతలను స్వీకరించారు. పూర్వ కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్న నుండి వీరు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా దేవస్థానం సిబ్బంది ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి అన్నివిభాగాల యూనిట్ అధికారులు, పర్యవేక్షకులు, అర్చకస్వాములు, వేదపండితులు, సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ ఆత్మీయ సమావేశానికి ధర్మకర్తలమండలి తరుపున ఓ మధుసూదన్రెడ్డి విచ్చేశారు.
ఈ సమావేశంలో పూర్వ కార్యనిర్వహణాధికారి ఎస్. లవన్నకి వీడ్కోలు సత్కారం చేయగా, నూతన కార్యనిర్వహణాధికారి పెద్దిరాజుకి స్వాగత సత్కారం చేశారు. కార్యనిర్వహణ అధికారి పెద్దిరాజు మాట్లాడుతూ దేవాలయాల ఉద్యోగులకు అటు భగవంతుడుని, ఇటు భక్తులను సేవించుకునే అవకాశం ఉంటుందన్నారు. అందరి సహకారంతో క్షేత్రాభివృద్ధికి శక్తివంచన లేకుండా తాను కృషి చేస్తానన్నారు. మన సంప్రదాయం తల్లి, తండ్రి, గురువు తరువాత స్థానం అతిథికి ఇస్తామన్నారు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతీ భక్తుడిని అతిథిగా భావించాలన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వుండేందుకు సిబ్బంది అందరూ తమవంతు పాత్ర పోషించాలన్నారు.
Srisailam: శ్రీశైలం నూతన ఈవోగా పెద్దిరాజు
ప్రతీ భక్తుడిని అతిథిగా భావించాలి
సంబంధిత వార్తలు | RELATED ARTICLES