Maha Shivaratri celebrations : శ్రీశైల క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవ సందడి మొదలైంది. ఈ రోజు యాగశాల ప్రవేశంతో ఉత్సవాలు లాంఛనంగా ప్రారంభం కాగా, రేపటి నుండి స్వామి అమ్మవార్లకు వివిధ వాహనసేవలు, గ్రామోత్సవాలు జరగనున్నాయి. భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడానికి ఫిబ్రవరి 13 నుండి అందరికీ కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
వీఐపీలకు మాత్రం ఉదయం 6, మధ్యాహ్నం 12 , సాయంత్రం 6 గంటల సమయాల్లో అలంకార దర్శనం కల్పించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ‘శ్రీ శక్తి’ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉండటంతో, ఈ ఏడాది మహిళా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Crime: ఇద్దరు బిడ్డలను చంపి తల్లి ఆత్మహత్య.. కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!
భక్తుల కోసం ఉచిత సేవలు , లడ్డూ ప్రసాదం
బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా ఫిబ్రవరి 13 నుండి 16 వరకు నాలుగు రోజుల పాటు భక్తులందరికీ ఉచితంగా లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 40 లక్షల లడ్డూలను సిద్ధంగా ఉంచారు.
అలాగే ఫిబ్రవరి 15, 16 తేదీల్లో భక్తుల వాహనాలకు టోల్ గేట్ల వద్ద ఎటువంటి ఫీజు లేకుండా ఉచితంగా అనుమతిస్తారు. పాదయాత్ర ద్వారా అటవీ మార్గంలో వచ్చే భక్తుల కోసం భీముని కొలను, కైలాసద్వారం వంటి ప్రాంతాల్లో స్వచ్ఛంద సంస్థల సహకారంతో అన్నదానం, మెడికల్ క్యాంపులు, మంచినీరు , సేద తీరేందుకు జర్మన్ షెడ్లను కూడా ఏర్పాటు చేశారు.
క్లిష్టమైన ఏర్పాట్లు , భద్రత
దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం పాలు, అల్పాహారం , మంచినీరు అందించేలా ఏర్పాట్లు చేశారు. పాతాళగంగలో స్నానాలు ఆచరించే భక్తుల భద్రత కోసం ఘాట్ల వద్ద గజఈతగాళ్లను నియమించారు. క్షేత్రంలోని పలు చోట్ల వాహనాల పార్కింగ్ సౌకర్యంతో పాటు వెలుతురు, మరుగుదొడ్లు , విశ్రాంతి తీసుకోవడానికి షెడ్లను సిద్ధం చేశారు. ఈనెల 12వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
అధికారుల సమీక్ష , నిఘా
బ్రహ్మోత్సవాల నిర్వహణపై మంత్రులు ఆనం నారాయణరెడ్డి, వంగలపూడి అనిత, బి.సి. జనార్దన్ రెడ్డి ఇప్పటికే అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియ , ఎస్పీ సునీల్ శరన్ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. సుమారు 3 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా, డ్రోన్ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచనున్నారు. వివిధ శాఖలకు చెందిన మరో 2 వేల మంది సిబ్బంది సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేస్తామని దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈఓ శ్రీనివాసరావు తెలిపారు.
Citizenship : బ్రిటీష్ వనిత.. 80 ఏళ్ల వయసులో పౌరసత్వ ‘పద్మం’.. పెపితా సేథ్ సేవా యజ్ఞం!

