శ్రీశైలం సమీపంలోని శిఖరం వద్ద రాత్రి 10 గంటల సమయంలో ఎలుగుబంటి సంచరించింది. రాత్రి డ్యూటీలో ఉన్న ఒక పూజారి అలానే దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ఎలుగుబంటి సంచారాన్ని తమ సెల్ ఫోన్ లో చిత్రీకరించారు. సెక్యూరిటీ సిబ్బంది గట్టిగా అరుస్తూ చప్పుడు చేయడంతో.. ఎలుగుబంటి పక్కన ఉన్న అటవీప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అయితే భక్తులు శిఖర దర్శనానికి వెళ్లే మెట్ల మార్గం ఈ ఎలుగుబంటి సంచరిస్తుందని భక్తులు దేవుడికి సమర్పించే కొబ్బరికాయలు తిని అటునుండి అటవీ ప్రాంతంలోకి వెళ్తుందని రాత్రి సమయంలో ఈ ఎలుగుబంటి సంచరించడంతో రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది బయాందోళనలకు గురవుతున్నారు. గతంలోను ఇదే ప్రాంతంలో పలుమార్లు ఎలుగుబంటి సంచరించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.
Srisailam: శ్రీశైల శిఖరం ఆలయం వద్ద ఎలుగుబంటి హల్చల్
శిఖరేశ్వర ఆలయం వద్ద ఎలుగుబంటి సంచారం
సంబంధిత వార్తలు | RELATED ARTICLES