Friday, November 22, 2024
Homeఆంధ్రప్రదేశ్Srisailam: ఓంకార నాదంతో మారుమొగుతున్న శ్రీగిరులు

Srisailam: ఓంకార నాదంతో మారుమొగుతున్న శ్రీగిరులు

శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మో త్సవాలు కొనసాగుతున్నాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం భక్తులు అధికసంఖ్యలో క్షేత్రానికి తరలివస్తున్నారు. వేకువజామునే పుణ్యస్నానాలు ఆచరించి శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో బారులు దీరారు. అయితే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది., ఉచిత, శీఘ్ర, అతి శీఘ్ర క్యూలైన్ల ద్వారా భక్తులు దర్శనానికి అనుమాతిస్తున్నారు. జ్యోతిర్ముడి కలిగిన శివదీక్షా భక్తులకు మాత్రం ప్రత్యేకంగా చంద్రావతి కళ్యాణ మండపం నుంచి క్యూలైన్ ఏర్పాటు చేసి మల్లన్న స్పర్శ దర్శనానికి దేవస్థానం అవకాశం కల్పిస్తున్నారు. క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు అల్పాహారం, మంచినీరు, బిస్కెట్లు, అంద జేస్తున్నారు భక్తుల రద్దీతో ఆలయ క్యూలైన్లన్నీ నిండిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ ఈవో లవన్న, ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఉచిత దర్శనానికి 4 గంటల సమయం, శీఘ్ర దర్శనానికి 2 గంట సమయం పడుతోంది. బుధువారం నుంచి ఇరుముడి కలిగిన శివ స్వాములకు కూడా స్పర్శ దర్శనం నిలిపివేసి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతించనున్నట్టు ఆలయ ఈవో లవన్న తెలిపారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రధాన వీధులన్నీ కళకళలాడుతున్నాయి .

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News