Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్ల జారీ ఎప్పుడంటే.?

Tirumala: తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్ల జారీ ఎప్పుడంటే.?

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శనం టోకెన్లు జారీ చేయాలని టీటీడీ(TTD) బోర్టు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈనెల మొదటి మంగళవారం స్థానిక భక్తులకు టోకెన్లు జారీ చేశారు. ఇక వచ్చే ఏడాది జనవరి నెలకు సంబంధించిన టోకెన్లు విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.

- Advertisement -

జనవరి 5న తిరుపతి మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శన టోకెన్లు జారీ చేయన్నట్లు తెలిపింది. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు టోకెన్ల కోసం తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News