ఏపీ పదో తరగతి పరీక్షల హాల్ టికెట్లు(SSC Hall Tickets) విడుదలయ్యాయి. bse.ap.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ నుంచే కాకుండా మన మిత్ర, వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా కూడా విద్యార్థులు హాల్ టికెట్లు పొందవచ్చు. ఇందుకోసం విద్యార్థులు అప్లికేషన్ నెంబర్, ఐడీ, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. కాగా ఈ నెల 17వ తేదీ నుంచి 31వ తేదీ వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి.
వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండిలా..
https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లండి
SSC హాల్ టికెట్స్ లింక్‌పై క్లిక్ చేయండి
రెగ్యులర్/ప్రైవేట్/వొకేషనల్/ఓఎస్ఎస్సీలో మీరు ఏ విధానంలో చదువుతున్నారో క్లిక్ చేయండి
మీ పేరు, జిల్లా, స్కూల్ పేరు, పుట్టిన తేదీ ఎంటర్ చేయాలి
అనంతరం హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి