YS Avinash Reddy| మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో మరో కీలక పరాణామం చోటు చేసుకుంది. కడప వైసీపీ ఎంపీ అవినాశ్‌రెడ్డి(YS Avinash Reddy)కి సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సునీత వేసిన పిటిషన్‌పై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా అప్రూవర్ దస్తరిగిని ప్రధాన నిందితుడు శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి బెదిరించాడని వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోర్టుకు తెలిపారు.
మరోవైపు తమపై నమోదుచేసిన కేసులను క్వాష్ చేయాలని సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి, సీబీఐ ఎస్పీ రాంసింగ్ దాఖలు చేసినా పిటిషన్‌పైనా విచారణ జరిగింది. దీంతో శివశంకర్‌రెడ్డి కుమారుడు చైతన్యరెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది.