Thursday, May 8, 2025
Homeఆంధ్రప్రదేశ్Supreme Court: ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితులకు సుప్రీంకోర్టులో షాక్

Supreme Court: ఏపీ లిక్కర్ స్కామ్.. నిందితులకు సుప్రీంకోర్టులో షాక్

ఏపీ లిక్కర్ స్కాం కేసులో(Liquor Scam Case) ముగ్గురు నిందితులకు సుప్రీంకోర్టులో(Supreme Court) షాక్ తగిలింది. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంవో కార్యదర్శి ధనుంజయరెడ్డి, మాజీ సీఎం జగన్‌ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, భారతి సిమెంట్స్‌ డైరెక్టర్‌ గోవిందప్ప బాలాజీలకు ముందస్తు బెయిల్‌ ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది.

- Advertisement -

లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముగ్గరు నిందితులు ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం తిరస్కరించింది. ఈ కుంభకోణంలో అన్ని వివరాలు బయటకు రావాలంటే పిటిషనర్లను అదుపులోకి తీసుకుని విచారించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ముందస్తు బెయిల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో వీరిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News